ఆర్ధిక మంత్రిగా నిర్మలా సీతారామన్! ఇందిరా గాంధీ తర్వాత ఈమెనే

ప్రధానిగా నరేంద్ర మోడీ రెండో సారి పదవిని చేపట్టి ఇప్పటికే 54 మందితో తన క్యాబినెట్ ని కూడా ప్రకటించేసాడు.అతి పెద్ద క్యాబినెట్ ని ఏర్పాటు చేసిన నరేంద్ర మోడీ అందులో కీలక పదవిని మన తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్ కి ఇచ్చి మహిళలలకి తన క్యాబినేత్ లో ఎవ్వరు ఇవ్వనంత పెద్ద హోదా ఇచ్చాడు.

 Nirmala Sitharaman Is Finance Minister-TeluguStop.com

రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగుతున్న నిర్మలా సీతారామన్ ఇప్పటికే దేశ రక్షణ మంత్రిగా గత ప్రభుత్వ హయాంలో బాద్యతలు నిర్వహించి తమ సమర్ధతని నిరూపించుకుంది.రక్షణ మంత్రిగా ఇందిరాగాంధీ తర్వాత పని చేసిన రెండో మహిళగా నిర్మలా సీతారామన్ గుర్తింపు పొందింది.

ఇదిలా ఉంటే కొత్త ప్రభుత్వంలో కూడా ప్రధాని మోడీ మరోసారి ఆమెకి కీలక పదవి ఇచ్చాడు.దేశంలో అత్యున్నత క్యాబినెట్ పదవులలో ఒకటిగా ఉండే ఆర్ధిక మంత్రి పదవిని బాద్యతలు ఆమెకి అప్పగించాడు.

గతంలో అరుణ్ జైట్లీ ఆర్ధిక మంత్రిగా ఉండగా ఆరోగ్య సమస్యల కారణంగా తాను మంత్రిగా కొనసాగానని చెప్పడంతో ఇప్పుడు మోడీ తన సెకండ్ ఆప్షన్ గా ఆర్ధిక మంత్రి పదవిని నిర్మలా సీతారామన్ కి ఇచ్చి ఆమె సామర్ధ్యాన్ని గౌరవించాడు.ఆర్ధిక శాస్త్రంలోనే పీజీ చేసిన ఆమెని ఆర్ధిక సంబంధమైన విషయాల మీద మంచి అవగాహన ఉంది.

ఇదిలా ఉంటే ఆర్ధిక మంత్రితో పాటు మరో కీలక శాఖ అయిన కార్పొరేట్ వ్యవహారాల శాఖ కూడా నిర్మలా సీతారామన్ కి మోడీ అప్పగించాడు.ఇక ఆర్ధిక మంత్రి పదవిని ఇందిరాగాంధీ తర్వాత చేపడుతున్న రెండో మహిళగా నిర్మలా సీతారామన్ అరుదైన గౌరవం సొంతం చేసుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube