నిర్మల్ జిల్లా పొలాల్లో చిరుతపులి.. పరుగులు తీసిన రైతులు..!

అడవుల్లో ఉండాల్సిన పులులు గ్రామాల్లో తిరుగుతుంటే అక్కడి ప్రజలు భయభ్రాతులకు గురవుతున్నారు.ఈమధ్య కాలంలో గ్రామాల్లో చిరుత పులుల అలజడులు ప్రజలను భయపెడుతున్నాయి.

 Nirmal District Leopard Roaming Public Panic-TeluguStop.com

లేటెస్ట్ గా నిర్మల్ జిల్లా కుభీర్ మండలం జాంగాం గ్రామ శివారులో చిరుత పులి సంచరించడం కలకల రేపుతుంది.పంట పొలాల్లో అడవిపందిపై చిరుత దాడి చేసింది.

దీనితో అక్కడ ఉన్న పశువుల కాపర్లు, వ్యవసాయ కూలీలు భయంతో పరుగులు తీశారు.విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా సథలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించరు.

 Nirmal District Leopard Roaming Public Panic-నిర్మల్ జిల్లా పొలాల్లో చిరుతపులి.. పరుగులు తీసిన రైతులు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అడవి పందిని వేటాడిన పులి జాడ లేకుండా పోయింది.

అయితే త్వరలోనే దాన్ని బంధించి తీసుకెళ్తామని ప్రజలు భయపడొద్దని అటవీ శాఖ అధికారులు చెప్పారు.

చిరుత పులి ఎటునుండైనా వచ్చి పశువులపై, ప్రజలపై దాడి చేస్తుందేమో అని అక్కడ ప్రజలు భయపడుతున్నారు.చిరుత జాడ కోసం అధికారులు గాలిస్తున్నారు.గతంలో కూడా ఇదే ప్రాంతంలో చిరుత పులి సంచరించింది.అప్పుడు ఆవు దూడపై అది దాడి చేసింది.

కొమరం భీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం సహా పలు జిల్లాల్లో పెద్దపులి సంచారం పెను ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే.

#Panic #Public #Roaming #Covid Time #NirmalDistrict

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు