వినయ్ శర్మ తల్లిని కూడా గుర్తుపట్టలేక పోతున్నాడు, ఉరి ఆపండి  

Vinaya Sharma Not Recoganized His Mother Please Stop The Hanging - Telugu Nirbhaya Victim

నిర్భయ దోషులకు ఉరి శిక్ష పడి చాలా కాలం అయ్యింది.కాని ఇప్పటి వరకు ఉరి శిక్ష అమలు చేయడం లేదు.

Vinaya Sharma Not Recoganized His Mother Please Stop The Hanging

కోర్టు, న్యాయ వ్యవస్థలో ఉన్న లొసుగులను వాడుకుని దోషులు ఉరి శిక్షను వాయిదా వేయిస్తూ వస్తున్నారు.ఈనెల మొదటి వారంలో వీరికి ఉరి శిక్ష అమలు కావాల్సి ఉండగా కోర్టు స్టే ఇవ్వడంతో ఉరి శిక్ష వాయిదా పడినది.

ఆ స్టే ఎత్తి వేయించేందుకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టులో పోరాడుతున్నాయి.ఈ సమయంలో నిర్భయ దోషి వినయ్‌ శర్మ మరో ఎత్తుగడ వేస్తున్నాడు.

ఇటీవల ఒక చిన్న గొడవలో వినయ్‌ శర్మ తలకు గాయం అయ్యిందట.దాంతో ఆయన కనీసం తల్లిని కూడా గుర్తు పట్టడం లేదు అంటూ ఆయన తరపు న్యాయవాది అంటున్నారు.

అలాంటి సమయంలో ఆయనను ఉరి తీయడం కుదరదు అంటూ న్యాయవాది వాదిస్తున్నాడు.ఆయన ఆరోగ్యం సరిగా లేని కారణంగా ఉరి వాయిదా వేయాలంటూ కోరాడు.వినయ్‌ శర్మ జ్ఞాపకశక్తి లేని సమయంలో ఉరి శిక్ష వేయడం మానవత దృక్పదంతో ఆలోచిస్తే మంచిది కాదని అన్నాడు.ఈ విషయమై కోర్టు విచారణ వాయిదా వేసింది.

తాజా వార్తలు