కరోనాకు కొత్త వ్యాక్సిన్ ‘లైఫ్ వైరోట్రీట్’ : నైపర్

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది.ఇప్పటికే దేశంలో 46 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.

 Vaccine For Corona Life Virotreat Covid,carona Virus, New Vaccine, Oxygen, Life-TeluguStop.com

దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.ఇప్పటికే పలు దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు కరోనాను నియంత్రించేందుకు వ్యాక్సిన్లను కనుగొన్న విషయం అందరికీ తెలిసిందే.

అయితే ఈ వ్యాక్సిన్ల క్లినికల్ ట్రయల్స్ కూడా చివరి దశకు చేరుకున్నాయి.

ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఏడు కరోనా వ్యాక్సిన్లకు క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు.

ఈ క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా ముగిస్తే మరొ రెండు నెలల్లో వ్యాక్సిన్ అందుబాటులో వస్తుందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.ఇదిలా ఉండగా హైదరాబాద్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్) సంస్థ కరోనాను నియంత్రించేందుకు కొత్త వ్యాక్సిన్ ను కనుగొంది.

నెబులైజర్ ఆధారంగా పనిచేసే మందును తయారు చేసింది.లైఫ్ యాక్టివస్, సుప్రీం ఇండస్ట్రీస్ సంయుక్త ఆధ్వర్యంలో ‘లైఫ్ వైరోట్రీట్’ అనే వ్యాక్సిన్ ను తయారు చేసింది.

ఈ వ్యాక్సిన్ ను గత నాలుగు నెలలుగా వివిధ జంతువులపై ప్రయోగించినప్పుడు సక్సెస్ గా పనిచేసిందని నైపర్ డైరెక్టర్ డాక్టర్ శశిబాలాసింగ్ తెలిపారు.

లైఫ్ యాక్టివస్ ఎండీ డాక్టర్ కేశవ్ డియో, సుప్రీం ఇండస్ట్రీస్ డైరెక్టర్ డాక్టర్ పంచసర, నైపర్ డీన్ డాక్టర్ శ్రీనివాస్ తో కలిసి ఆమె శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

లైఫ్ వైరోట్రీట్ కి సంబంధించి పలు ప్రత్యేకతలను వెల్లడించారు.ప్రపంచవ్యాప్తంగా అందరినీ వణికిస్తున్న కరోనాను అడ్డుకునేందుకు లైఫ్ వైరోట్రీట్ విజయవంతంగా పనిచేస్తుందన్నారు.ఈ మందును గత నాలుగు నెలల్లో వివిధ రకాల జంతువులపై ప్రయోగించగా విజయవంతంగా పనిచేస్తోందని గుర్తించామన్నారు.మనుషులపై ప్రయోగించేందుకు క్లినికల్ ట్రయల్స్ నిర్వహణ, మందు తయారీకి సంబంధించి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) కి నివేదిక పంపగా ఆమోదం కూడా లభించిందన్నారు.

లైఫ్ వైరోట్రీట్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైతే వ్యాక్సిన్ ను బాధితులతోపాటు అనుమానితులు కూడా ముందస్తుగా తీసుకోవచ్చన్నారు. ఈ వ్యాక్సిన్ రక్తంలో ఆక్సిజన్ శాతాన్ని పెంచేందుకు వీలు పడుతుందని, ఫ్లూ, శ్వాసకోశ వైరల్ ఇన్ఫెక్షన్లపై ప్రభావం చూపుతుందని శశిబాలాసింగ్ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube