చిత్రం : నిన్ను కోరి బ్యానర్ : డివివి ఎంటర్టైన్మెంట్స్, కోన ఫిలిం కార్పోరేషన్దర్శకత్వం : శివ నిర్వాననిర్మాత : డివివి దానయ్య, కోన వెంకట్ సంగీతం : గోపి సుందర్ విడుదల తేది : జులై 7, 2017నటీనటులు : నాని, నివేతా థామస్, ఆది పినిశెట్టి తదితరులు
కథలోకి వెళితే :
ఉమామహేశ్వర రావు (నాని) – పల్లవి (నివేత) ఇద్దరు ప్రేమించుకుంటారు.ఇద్దరిది కల్మషం లేని ప్రేమ.
పెళ్లి చేసుకోవాలనుకుంటారు, కలిసి బ్రతకాలనుకుంటారు.కాని కెరీర్ కోసం ఉమామహేశ్వరరావు డిల్లికి వెళ్ళాల్సివస్తుంది.
అది కూడా పల్లవి ఇష్టానికి వ్యతిరేకంగా.ఇద్దరు దూరమైపోతారు పల్లవికి ఒక ఎనారై సంబంధం వస్తుంది.
అతడే అరుణ్ (ఆది పినిశెట్టి).తనని పెళ్లి చేసుకున్న పల్లవి అమెరికా వెళ్ళిపోతుంది.
పల్లవికి దూరమైన ఉమామహేశ్వరరావు మద్యానికి దగ్గరవుతాడు.చెలి ఎడబాటుని తట్టుకోలేకపోతాడు.
కాని విధి తన ప్రేమకథను మలుపుతిప్పి ఉమామహేశ్వరరావు అమెరికా వెళ్ళేలా చేస్తుంది.డిప్రెషన్ లో ఉన్న ఉమా జీవితాన్ని చూడలేకపోతుంది పల్లవి.
తనని అలా చూడలేదు, అలాగని వివాహబంధాన్ని తెంచుకోలేదు.మరోవైపు ఉమా మాత్రం పల్లవిని తిరిగి పొండుతాననే ఆశలోనే ఉంటాడు.మరి పల్లవి తిరిగి ఉమా జీవితంలోకి వచ్చిందా ? అరుణ్ పరిస్థితి ఏమిటి ? సినిమా చూసి తెలుసుకోండి.
నటీనటుల నటన :
నాని అనగానే మనకు కామెడి టైమింగ్ గుర్తుకువస్తుంది.కామెడికి మించిన రసాలు పందిచగల నటుడు నాని.కాని కామెడి అతనిలో మ్యేచురిటిని ఇన్నాళ్ళు డామినేట్ చేసింది.కాని ఈ సినిమాలో అందుకు పూర్తీ భిన్నంగా, కామెడి చేసే నాని కన్నా, మనల్ని ఏడిపించిన నాని ఎక్కువ గుర్తుండిపోతాడు.మరి ముఖ్యంగా క్లయిమాక్స్ లో నాని పెర్ఫార్మేన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే.
తన కెరీర్ బెస్ట్ ఎపిసోడ్ అది.ఇది ఎదో టిపికల్ గా చెప్పడం లేదు.సినిమా చూస్తే మీరు ఏకిభవించకుండా ఉండలేరు
తన అందమైన ముఖం కేవలం ఆకర్షణ కోసమే లేదు, దానిలో ఎన్నో భావాలు పలుకుతాయని నివేతా ఇప్పటికే జంటిల్మన్ సినిమా ద్వారా నిరూపించింది.కరువుతో కొట్టాడుతున్న తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి నటి దొరికింది.
నాని లాంటి నేచురల్ యాక్టర్ తో రెండు సినిమాలు చేసి, రెండు సినిమాల్లో కూడా తనని ప్రేక్షకులు గుర్తుపెట్టుకునేలా అభినయించింది నివేతా.తన కళ్ళు నిజంగానే ప్రేక్షకులతో మాట్లాడుతున్నాయి
ఆది పినిశెట్టి పాత్ర ఎలా డిజైన్ చేసి ఉంటారో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది.
ఎందుకంటే ఇలాంటి బేసిక్ స్టోరి లైన్ తో చాలా సినిమాలు చూసాం మనం.కొత్తగా లేకపోయినా, బాగుంది పాత్ర.
టెక్నికల్ డిపార్ట్మెంట్ :
టెక్నికల్ డిపార్ట్ మెంట్ సమష్టి కృషి కనబడుతుంది ఈ సినిమాలో.గోపి సుందర్ బాణీలు ఇప్పటికే సూపర్ హిట్.
అడిగా అడిగా, ఉన్నట్టుండి గుండె యువతకు పిచ్చి పిచ్చిగా నచ్చేసాయి.ఈ పాటలు తెరపై కూడా బాగున్నాయి.
పాటల్లాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా హాయిగా ఉంది.సినిమాతో గ్రాఫీ బాగుంది.
అమెరికాలో లో చాలాభాగం షూట్ చేసారు కాబట్టి విజువల్స్ ఎంత రిచ్ గా ఉంటాయో మీరు ఊహించగలరు.ఎడిటింగ్ డిపార్ట్మెంట్ ఫస్టాఫ్ మీద ఇంకొంచెం శ్రద్ధ పెట్టాల్సింది.
అయినా పెద్దగా కంప్లయింట్స్ ఏమి లేవు.సినిమా నిడివి చక్కగా కుదిరింది.
కోన వెంకట్ నుంచి ఇలాంటి స్క్రీన్ ప్లే బహుషా చాలామంది ఊహించి ఉండరు.ఇటు నిర్మాతగా, అటు స్క్రీన్ ప్లే రైటర్ గా కొన్నేళ్ళ తరువాత సక్సెస్ అయ్యారు కోనా.
విశ్లేషణ :
బేసిక్ లైన్ కొత్తదేమీ కాదు.ఇద్దరు ప్రేమించుకోవడం, విడిపోవడం, అమ్మాయి జీవితంలోకి మరో వ్యక్తీ రావడం, తన తప్పు అర్థం చేసుకున్న హీరో తిరిగి ఆ అమ్మాయిని పొందాలనుకోవడం … ఇలాంటి కథలు మనం చాలా చూసాం.
కాని ఇప్పటివరకు ఈ ఐడియాతో వచ్చిన కథలకు దీనికి తేడా ఏమిటంటే, స్క్రీన్ ప్లే అండ్ టేకింగ్.దర్శకుడు శివ నిర్వాన, రచయిత కోనా వెంకట్ ఈ సినిమాని రాసుకున్న పధ్ధతి, తీసిన పధ్ధతి నిన్ను కోరిని ఎక్కడో కూర్చోబెడుతుంది.
చాలా మ్యేచూర్డ్ ఎమోషన్స్, ఎక్కడా సిల్లిగా, ఓవర్ డ్రమాటిక్ గా అనిపించని టేకింగ్ తో మంచి సినిమాని అందించారు.ఫస్టాఫ్ లో కొన్ని సీన్స్ మనకు ఆసక్తి కలిగించకపోవచ్చు కాని, సెకండాఫ్ అంత మర్చిపోయేలా చేస్తుంది.
ఈ సినిమా వినోదాల విందు కాకపోవచ్చు, కాని బోర్ కొట్టాదు.పూర్తిగా కొత్తరకం లవ్ స్టోరి కాకపోవచ్చు, కాని అందంగా ఉంటుంది.ముగింపు వాక్యంగా చెప్పాలంటే, నాని ఖాతాలో మరో హిట్.
ప్లస్ పాయింట్స్ :
* నాని, నివేత,* స్క్రీన్ ప్లే * క్లయిమాక్స్ * సంగీతం* ఎమోషన్స్
మైనస్ పాయింట్స్ :
* కొద్దిగా ఫస్టాఫ్
చివరగా :
“నిన్ను కోరి” ఏరికోరి చూడొచ్చు.