రకుల్ బ్రదర్ కి నాగ్ హిట్టు టైటిల్  

Nag Released Rakul Brother Movie First Look-

ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా స్టార్ హీరోల సోదరులు హీరోగా ఎంట్రీ ఇవ్వడమనేది కామన్.అయితే హీరోయిన్స్ బ్రదర్స్ కథానాయకులుగా రావడం అనేది చాలా రేర్.అదే తరహాలో హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ కూడా తన బ్రదర్ ని సినిమా ఇండస్ట్రీలోకి లాగుతోంది..

Nag Released Rakul Brother Movie First Look--Nag Released Rakul Brother Movie First Look-

లవ్ స్టోరీలోనే యాక్షన్ ని ఎలివేట్ చేస్తూ తెరకెక్కించిన చిత్రంలో రకుల్ బ్రదర్ అమన్ ప్రీత్ ఆదరగొట్టేశాడని తెలుస్తోంది.

ఇక సినిమా టైటిల్ విషయానికి వస్తే.నాగ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటైన నిన్నే పెళ్లాడతా సినిమా యొక్క పేరునే మళ్ళీ వాడేస్తున్నారు.

ఇక ఆ సినిమా టైటిల్ ని మన్మథుడు నాగార్జున విడుదల చేశారు.ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోస్ నెటీజన్స్ ని ఆకట్టుకుంటున్నాయి.రకుల్ నాగ్ తో మన్మథుడు 2 సినిమాలో నటించిన సంగతి తెలిసిందే..

ఆ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

నాగ్ తో నటించిన సాన్నిహిత్యం ఉండడంతో అమ్మడు తమ్ముడి సినిమాకు బాగానే హెల్ప్ అయ్యేలా చేసుకుంది.ఇక నిన్నే పెళ్లాడతా సినిమాను కూడా మంచి టైమ్ చూసుకొని విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.మౌనిక శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు వైకుంట్ బోను దర్శకత్వం వహిస్తున్నాడు.