ఇలాంటి ఆపరేషన్‌లు సినిమాల్లోనే అనుకుంటే నిజం జీవితంలో కూడా జరిగాయే... ఇంత కంటే దారుణం మరోటి లేదు  

మనం కొన్ని సినిమాల్లో డాక్టర్లపై జోకులు వేసిన సంఘటనలు చూశాం. అంటే ఆపరేషన్‌ చేసిన డాక్టర్‌ ఏదైనా వస్తువును కడుపులో వదిలేయడం, మళ్లీ దాన్ని ఆపరేషన్‌ చేసి తీయడం వంటివి మనం ఇప్పటి వరకు సినిమాల్లోనే చూశాం. కమల్‌ హాసన్‌ నటించిన ఒక సినిమాలో ఆపరేషన్‌ చేసి కడుపులో టైం పెట్టి డాక్టర్‌ మర్చి పోతుంది. దాంతో అప్పుడప్పుడు అలారమ్‌ వస్తూ తెగ ఇబ్బంది పెడుతుంది. అది కాస్త ప్రేక్షకులను తెగ నవ్వించింది. అయితే నిజ జీవితంలో కూడా ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతాయని నిరూపితం అయ్యింది.

హైదరాబాద్‌లోనే ఫేమస్‌ హాస్పిటల్‌ ఏది అంటే ఠక్కున వినిపించే పేర్లలో నిమ్స్‌ హాస్పిటల్‌ ఒకటి. ఈ హాస్పిటల్‌ పేదలకు పెద్దలకు అందరికి వైధ్యం అందిస్తూ ఉంటుంది. హాస్పిటల్‌లో నిపుణులు చికిత్స అందిస్తూ ఉంటారు. ప్రభుత్వ మరియు ప్రైవేట్‌ భాగస్వామ్యంతో ఈ హాస్పిటల్‌ సాగుతుందనేది అందరు చెప్పే విషయం. పెద్ద పెద్ద జబ్బులకు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఎంతో మంది ఇక్కడకు వస్తూ ఉంటారు. అయితే అక్కడ మాత్రం వైధ్యం చేసే విషయంలో డాక్టర్లు చాలా అసత్వంను ప్రదర్శిస్తున్నారు. ఎన్నో సార్లు గతంలో నిమ్స్‌లో దారుణ సంఘటనలు జరిగాయి.

NIMS Doctors Forget Scissors Inside Patient’s Stomach-Hyderabad Nims Stomach Ache X-ray Showed The

NIMS Doctors Forget Scissors Inside Patient’s Stomach

తాజాగా హైదరాబాద్‌ పాతబస్తీకి చెందిన మహిళ హెర్నియాతో బాధపడుతున్న నేపథ్యంలో ఆమెకు నిమ్స్‌ వైధ్యులు ఆపరేషన్‌ చేశారు. ఆ ఆపరేషన్‌ అయితే సక్సెస్‌ అయ్యింది కాని, ఆమెకు అప్పటి నుండి కడుపు నొప్పి మరియు తీవ్రమైన నడుము నొప్పి వస్తూ ఉంది. దాంతో ఆమెను వారం రోజుల తర్వాత హాస్పిటల్‌కు తీసుకు వచ్చారు. ఆమె కడుపు నొప్పికి కారణం ఏంటో తెలుసుకునేందుకు ఎక్స్‌రే తీయించారు. ఎక్స్‌రేలో నోరు తెరచే విషయం వెళ్లడయ్యింది. ఆ మహిళ కడుపులో సీజర్‌ ఉంది. అది కూడా ఆపరేషన్‌ సమయంలో ఉపయోగించే సీజర్‌. అంటే వారం రోజుల క్రితం జరిగిన ఆపరేషన్‌ సమయంలో ఆ మహిళ కడుపులో సీజర్‌ పెట్టి మర్చి పోయి, కుట్టు వేశారు.

NIMS Doctors Forget Scissors Inside Patient’s Stomach-Hyderabad Nims Stomach Ache X-ray Showed The

విషయం తెల్సిన పేషంట్‌ తరపు బంధువులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఇలాంటి దారుణమై సంఘటనకు ప్రభుత్వం దిగి రావాలని, నిమ్స్‌ వైధ్యులు దీన్ని పట్ట క్షమాపణలు చెప్పి నష్టపరిహారం చెల్లించాలంటూ ఆందోళన చేశారు. మరో వైపు ఆమెకు మరోసారి ఆపరేషన్‌ నిర్వహించి కడుపులో ఉన్న కత్తెరను తీసేశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.