జ‌గ‌న్ టార్గెట్‌గా నిమ్మ‌గ‌డ్డ కొత్త వ్యూహం.. తెర వెన‌క ట్విస్ట్ ఇదే..!  

Nimmagadda Ramesh Kumar Targets YS Jagan Govt, High Court, EC Officer Nimmagadda Ramesh kumar, YS Jagan, Nimmagadda vs Ys Jagan, EC Funds - Telugu Ec Funds, Ec Officer Nimmagadda Ramesh Kumar, High Court, Nimmagadda Ramesh Kumar Targets Ys Jagan Govt, Nimmagadda Vs Ys Jagan, Ys Jagan

ఏపీలో స్థానిక ఎన్నిక‌ల‌పై మ‌రోసారి చ‌ర్చ‌కు వ‌చ్చింది.ఈ ఏడాది ప్రారంభంలోనే ఈ విష‌యంపై తీవ్ర యుద్ధం చెల‌రేగి.

TeluguStop.com - Nimmagadda Vs Ys Jagan Ec Funds High Court

చివ‌రికి న్యాయ‌ప‌ర‌మైన పోరాటాల దిశ‌గా ఇవి న‌డిచాయి.అయితే, ఇప్పుడు మ‌రోసారి స్థానిక ఎన్నిక‌ల యుద్ధానికి తెర‌దీస్తున్న ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ కు ప్ర‌భుత్వానికి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే.భ‌గ్గుమ‌నేలా ఉంది ప‌రిస్థితి.

TeluguStop.com - జ‌గ‌న్ టార్గెట్‌గా నిమ్మ‌గ‌డ్డ కొత్త వ్యూహం.. తెర వెన‌క ట్విస్ట్ ఇదే..-Political-Telugu Tollywood Photo Image

ఆయ‌న ప్ర‌తివిష‌యంలోనూ ప్ర‌భుత్వాన్ని బ‌ద్నాం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తు న్నార‌న్న‌ది స‌ర్కారు పెద్ద‌ల ఆలోచ‌న‌.ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఉన్నంత వ‌ర‌కు కూడా స్థానిక ఎన్నిక‌లు నిర్వ‌హించ‌రాద‌ని నిర్ణ‌యంలో ఉన్న‌ట్టు స‌మాచారం.

అంటే.వ‌చ్చే ఏడాది మార్చి నెలాఖ‌రు వ‌ర‌కు కూడా నిమ్మ‌గ‌డ్డ స‌ద‌రు ప‌దవిలోనే ఉండ‌నున్నారు.సో.ఆయ‌న ఆ ప‌ద‌వి నుంచి దిగిపోయిన త‌ర్వాత ఎవ‌రు ఆ సీటులోకి వ‌చ్చినా.స‌రే ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతు న్నాయి.అయితే, నిమ్మ‌గ‌డ్డ‌పై కొన్ని అనుకూల శ‌క్తులు ప‌నిచేస్తున్నాయ‌ని.వెంట‌నే ఎన్నిక‌లు నిర్వ‌హించేలా ఒత్తిళ్లు తెస్తు న్నాయ‌ని అంటున్నారు వైసీపీ నేతలు.ఆయ‌న హ‌యాంలోనే ఎన్నిక‌లు నిర్వ‌హించేలా పెద్ద ఎత్తున హైద‌రాబాద్ వేదిక‌గా.

చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని అంటున్నారు.

దీనికి మ‌ద్ద‌తుగా ఇటీవ‌ల నిమ్మ‌గ‌డ్డ హైకోర్టును ఆశ్ర‌యించారు.స్థానిక ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి ప్రభుత్వం నిధులు ఇవ్వ‌డం లేద‌ని, ఇచ్చేలా ఆదేశించాల‌ని ఆయ‌న కోరారు.అయితే, ఎప్పుడు నిర్వ‌హిస్తార‌నే విష‌యాన్ని మాత్రం ఆయ‌న చెప్పలేదు.

కానీ, వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో స్థానిక ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు ప‌క్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నార‌నే ఆలోచ‌న జ‌రుగుతోంద‌ని వైసీపీ వ‌ర్గాల నుంచి అందుతున్న‌ స‌మాచారం.

జ‌గ‌న్ టార్గెట్‌గా ఆయ‌న ఈ వ్యూహంతో త‌న ప‌ద‌వీ కాలంలోనే ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని చూస్తున్నార‌ట‌.

ఈ ప‌రిణామాల‌తో రాష్ట్రంలో జ‌న‌వ‌రిలో ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధ‌మ‌వుతోంద‌ని.దీనిని ఎదుర్కొన్నా.

ఒక‌టి లేదా రెండు నెల్ల‌లో అంటే. నిమ్మ‌గ‌డ్డ ప‌ద‌వీ కాలం పూర్త‌య్యేలోగానే ఎన్నిక‌ల‌కు అవ‌కాశం ఉంటుంద‌ని వైసీపీ వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి.

మొత్తానికి నిమ్మ‌గ‌డ్డ వ‌ర్సెస్ స‌ర్కారుకు మ‌రో పోరు త‌ప్పేలా లేద‌ని అంటున్నారు.మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

#ECOfficer #NimmagaddaVs #EC Funds #YS Jagan #High Court

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nimmagadda Vs Ys Jagan Ec Funds High Court Related Telugu News,Photos/Pics,Images..