సీక్రెట్ రాజకీయం : నిమ్మగడ్డ సుజనా కామినేని రహస్య మీటింగ్ ?

మొదటి నుంచి ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం వివాదాస్పదంగా ఉంటూ వస్తోంది.ఆయనపై వైసిపి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తూ, తెలుగుదేశం పార్టీ కి అనుకూలమైన వ్యక్తిగా, ఆయనను చిత్రీకరిస్తూ వస్తోంది.

 Nimmagadda Ramesh Kumar Meet Sujana Chowdary And Kamineni Srinivas Rao At Park H-TeluguStop.com

అక్కడితో ఆగకుండా, ఆయన ఎన్నికల కమిషనర్ గారు పనికిరాడు అంటూ ప్రత్యేకంగా ఆర్డినెన్స్ తీసుకువచ్చి ఆయనను తప్పించి ఆయన స్థానంలో రిటైర్డ్ హైకోర్టు జడ్జి కానగరాజు ని నియమించారు.ఈ వ్యవహారం పై నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈ వ్యవహారం సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉంది.ఇదిలా ఉండగానే తాజాగా రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, టిడిపి మాజీ మంత్రి బిజెపి నాయకుడు కామినేని శ్రీనివాస రావు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో రహస్యంగా భేటీ అయిన దృశ్యాలు ఇప్పుడు మీడియాలో హైలెట్ అవుతున్నాయి.

ఈనెల 13వ తేదీన ఉదయం 10.40 నిమిషాలకు ఈ ముగ్గురు భేటీ అయినట్టుగా ఆధారాలు మీడియాలో బయటకు వచ్చాయి.దాదాపు గంటన్నర పాటు వీరి సమావేశం జరిగినట్లుగా వీడియో రికార్డులను బట్టి తెలుస్తోంది.వీరు ముగ్గురు చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు కావడంతోపాటు, ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఇది రాజకీయంగా కుట్ర పన్నెందుకే ఈ భేటీ జరిగినట్టుగా వైసీపీ ఇప్పుడు ఆరోపిస్తోంది.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో రమేష్ కుమార్, టిడిపి కి అనుకూలంగా వ్యవహరించినట్టుగా పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది.ఈ ఆరోపణలకు బలం చేకూర్చుతూ ఇప్పుడు వీరు ముగ్గురు రహస్యంగా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ ముగ్గురు హోటల్ లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి, బయటకు వెళ్లే వరకు వాటికి సంబంధించిన సిసి టీవీ ఫుటేజ్ ఆధారాలు బయటకు రావడంతో రాజకీయంగా కలకలం రేగుతోంది.హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్లో ఈ ముగ్గురు వేరు వేరు లిఫ్ట్ ల ద్వారా ఎనిమిదో అంతస్తుకు చేరుకోవడం, ఈ ముగ్గురినీ ఒకే వ్యక్తి రిసీవ్ చేసుకోవడం, సిసి టివి ఫుటేజ్ లో స్పష్టంగా కనిపిస్తోంది. నిమ్మగడ్డ, సుజన, కామినేని శ్రీనివాస రావు ఈ ముగ్గురు దాదాపు గంటపాటు రహస్యంగా మీటింగ్ జరపడం, ఆ తరువాత మొదటగా కామినేని శ్రీనివాస రావు గది నుంచి బయటకు వెళ్ళగా, ఆ వెనక నిమ్మగడ్డ రమేష్ కుమార్ బయటకు రావడం, అందరికంటే చివరగా సుజనాచౌదరి బయటకు వస్తున్న దృశ్యాల మీడియాలో ఇప్పుడు ప్రచారం అవుతుండటం రాజకీయంగా కలకలం రేపుతోంది.ఈ వ్యవహారంపై వైసిపి పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుండడంతో, టిడిపి, బిజెపి శ్రేణులు డైలమాలో పడ్డాయి.

తాము మొదటి నుంచి చెబుతున్నట్టుగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే వ్యాఖ్యలకు బలం చేకూరుతుందని వైసిపి చెబుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube