నిమ్మగడ్డకు ఏపీ గవర్నర్ గ్రీన్ సిగ్నల్, మరి సర్కార్ మాటేంటో...

ఏపీ మాజీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఏపీ సర్కార్ కు మధ్య ఏర్పడిన విభేదాల నేపథ్యంలో ఆయన తిరిగి ఈసీ గా భాద్యతలు స్వీకరించడానికి రాష్ట్ర గవర్నర్ ను ఆశ్రయించాల్సి వచ్చింది.ఏపీ ఎన్నికల కమీషనర్ గా ఉన్న నిమ్మగడ్డ పై ఏపీ సర్కార్ వేటు వేసిన విషయం తెలిసిందే.

 Ap Governor Giving Orders For Rejoining To Nimmagadda, Nimmagadda Ramesh Kumar,-TeluguStop.com

నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి కాలన్ని కుదిస్తూ అత్యవసరంగా ఆర్డినెన్స్ ను తీసుకువచ్చి, ఆ తర్వాత ఆయన స్థానంలో మాజీ జస్టిస్ కనగరాజును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.అయితే దీన్ని సవాల్ చేస్తూ రమేష్ కుమార్ కోర్టు ను ఆశ్రయించడం తో ధర్మాసనం ఆర్డినెన్స్ కొట్టివేసి ఆయన్నే తిరిగి నియమించాలని సూచించింది.

సుప్రీం కోర్టు కూడా స్టే ఇచ్చేందుకు నిరాకరించినా ప్రభుత్వం పట్టించుకోలేదు.ఆయన తిరిగి ఈసీ గా నియమించాలి అంటూ సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించినప్పటికీ ఏపీ సర్కార్ మాత్రం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకపోవడం తో తిరిగి నిమ్మగడ్డ ఏపీ హైకోర్టు ను ఆశ్రయించారు.

దీనితో ఏపీ హైకోర్టు కూడా ఏపీ సర్కార్ తీరుపై మండిపడింది.సుప్రీం ఆదేశాలు కూడా పట్టించుకోరా అంటూ ప్రశ్నించి, తిరిగి నిమ్మగడ్డ ను ఈసీ గా నియమించాల్సిన భాద్యత గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ కు అప్పగించింది.

దీనితో ఇటీవల గవర్నర్ అపాయింట్ మెంట్ తీసుకున్న నిమ్మగడ్డ తన వినతి పత్రాన్ని అందించారు.

దీనిపై స్పందించిన గవర్నర్ హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలి అంటూ ఆదేశాలు కూడా జారీ చేశారు.

దీనితో ఎన్నికల కమీషనర్ గా తిరిగి భాద్యతలు చేపట్టడానికి నిమ్మగడ్డ కు సుగమం అయ్యింది.అయితే తిరిగి నిమ్మగడ్డ ను ఈసీ గా నియమించడం పై ఏపీ సర్కార్ మాత్రం ఇంతవరకు స్పందించలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube