నిమ్మగడ్డ కేసులో జగన్ 'సర్కార్'కు ఎదురు దెబ్బ!?

నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో జగన్ సర్కార్ కు మరోసారి షాక్ తగిలింది.నిమ్మగడ్డ అంశంలో కోర్టు ధిక్కరణ ప్రొసీడింగ్స్‌పై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.

 Nimmagadda Ramesh Kumar, High Court, Ap Governor, Ys Jagan Government, Nimmgadda-TeluguStop.com

నేడు విచారణ జరిగింది.దీంతో ఈ వ్యవహారంలో ప్రభుత్వం తీరును సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పు పట్టడమే కాకుండా సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఈ కేసు విషయంలో ప్రతిదీ వారికీ తెలుసని.కావాలనే ఈ కేసులో స్టే ఇవ్వట్లేదని.

గవర్నర్‌ లేఖ పంపినా రమేష్‌ కుమార్‌కు పోస్టింగ్‌ ఇవ్వకపోవడం అత్యంత దారుణమని సీజేఐ వ్యాఖ్యానించారు.కాగా హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం చేసిన అసభ్యకర వ్యాఖ్యల గురించి నిమ్మగడ్డ తరపు లాయర్ హరీష్ సాల్వే పూసగుచ్చినట్టు కోర్టుకు వివరించారు.

దీంతో ఏపీ సర్కార్ కు మరోసారి ఎదురు దెబ్బ తగిలినట్టు అయ్యింది.హైకోర్టు తీర్పు ఇచ్చినా నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామకం ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించింది.

ఇది ఇలా ఉండగా.హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎన్నికల కమిషనర్ గా నియమించాలని ఏపీ ప్రభుత్వానికి గవర్నర్ సూచించిన సంగతి విదితమే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube