ఏకగ్రీవల విషయంలో ఆ రెండు జిల్లాలకు కీలక షాకిచ్చిన నిమ్మగడ్డ..!!

పంచాయతీ ఎన్నికలలో దాదాపు 90 శాతం ఏకగ్రీవాలు జరగాలనే ఉద్దేశంతో అధికార పార్టీ రంగంలోకి దిగితే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాలు.వాటికి బ్రేకులు వేసినట్లయింది.

 Nimmagadda Is A Key Issue For The Two Districts In Terms Of Consensus, Panchayat-TeluguStop.com

ఒకపక్క ఏకగ్రీవాలు ప్రోత్సహిస్తూ… ఏ ఏ పంచాయతీలో ఏకగ్రీవాలు అవుతాయో వాటికి 20 లక్షల రూపాయల నగదు కూడా ప్రోత్సాహం గా ప్రకటించడం జరిగింది.కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకోవటంతో… ఏకగ్రీవ ఛాయలు చాలాచోట్ల కనబడలేదు.

పంచాయతీ ఎన్నికల రాష్ట్రవ్యాప్తంగా 3249 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా అందులో 452 మాత్రమే ఏకగ్రీవం అయ్యాయి.

ఇదిలా ఉంటే చిత్తూరు, గుంటూరు జిల్లాలలో ఏకగ్రీవ ఫలితాలను ప్రకటించవద్దని నిమ్మగడ్డ రమేష్ కుమార్ కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం సంచలనంగా మారింది.

చిత్తూరు జిల్లాలో 454 పంచాయతీలో 110 ఏకగ్రీవం అవ్వగా… గుంటూరు జిల్లాలో 337 పంచాయతీలు 67 ఏకగ్రీవం అయ్యాయి.ఈ క్రమంలో ఈ విషయంలో వెంటనే ప్రకటించ వద్దని ఏకగ్రీవాలు పై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని… రెండు జిల్లాల కలెక్టర్లకు నిమ్మగడ్డ ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

Telugu Guntur, Panchayathi-Telugu Political News .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube