వైసీపీకి మేలు చేసిన నిమ్మగడ్డ ? ఎలా అంటే..?

ప్రస్తుతం ఏపీలో పెరుగుతున్న పొలిటికల్ వార్ ముదిరి పాకాన పడింది.మొన్నటి వరకు విగ్రహాల ధ్వంసం అయిన వ్యవహారం ఏపీలో వాడివేడిగా మారి రాజకీయ వివాదానికి తెరలేపింది.

 Ysrcp, Tdp, Jagan, Elections,-TeluguStop.com

హిందుత్వానికి వ్యతిరేకంగా జగన్ వ్యవహరిస్తున్నారని విపక్షాలు ఆయనను టార్గెట్ చేసుకుంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేయడం,  ఆ విమర్శలకు ప్రభుత్వం సరైన సమాధానం చెబుతూనే, మరోవైపు హిందూ మతానికి తాము ఎంత ప్రాధాన్యం ఇస్తున్నాము అనేది చెప్పుకునేందుకు ప్రభుత్వం గట్టిగా ప్రయత్నించింది.ఏది ఏమైనా విగ్రహాల ధ్వంసం వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వం కాస్త ఇబ్బందులు ఎదుర్కొంది.

ఈ విషయంలో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై పైచేయి సాధించినట్లు గా వ్యవహరించాయి.

 ఇది ఇలా ఉండగానే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం తెర పైకి వచ్చింది.

ఎన్నికలకు వెళ్లేందుకు ఏపీ ప్రభుత్వం ఇష్టపడకపోయినా, ఎన్నికల అధికారిగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వడం, దీనిపై కోర్టుల వరకు వ్యవహారం వెళ్లడం, చివరకు ఎన్నికల కమిషన్ కు అనుకూలంగా తీర్పు రావడం దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం వంటి వ్యవహారాలు నడిచాయి.ప్రస్తుతం నిమ్మ గడ్డ వర్సెస్ ఏపీ ప్రభుత్వం అన్నట్లుగా వార్ నడుస్తోంది.

ఏదో రకంగా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయించేందుకు ప్రభుత్వం భావిస్తోంది.దీంతో పాటు, అధికారుల చేత సహాయనిరాకరణ ప్లాన్ చేస్తోంది.

Telugu Chandrababu, Ysrcp-Telugu Political News

నిమ్మగడ్డ మాత్రం మరో రెండు నెలల్లో తాను పదవి విరమణ చేయబోతున్న నేపద్యంలో, ఏదోరకంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి తీరాలి అనే పట్టుదలతో ఉన్నారు.నిమ్మగడ్డ పదవిలో ఉండగా ఎన్నికలకు వెళితే ఆయన టీడీపీకి అనుకూలంగా వ్యవహరించడం తో పాటు, వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెడతారని , తమ ప్రభుత్వ హయాంలో నియమించిన అధికారులను బదిలీ చేస్తారని , ఇంకా అనేక రకాల ఇబ్బందులు సృష్టిస్తారు అని ఇలా ఎన్నో  ఆందోళనలలో ఏపీ ప్రభుత్వం  ఉంటూ వచ్చింది.ఇలా వైసీపీ ప్రభుత్వం వర్సెస్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నట్టుగా వ్యవహారం నడుస్తోంది.కాకపోతే పైకి తెలియకుండానే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీ ప్రభుత్వానికి మేలు చేసినట్టు కనిపిస్తోంది.

ఎందుకంటే మొన్నటి వరకు ఏపీలో విగ్రహాల అంశం, హిందుత్వం విషయంలో జగన్ పై విమర్శలు వచ్చాయి.నిత్యం ఇదే రకమైన చర్చ జోరుగా మీడియాలో నడిచింది.ఎప్పుడైతే స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం తెరపైకి వచ్చిందో , అప్పటి నుంచి చర్చంతా దానిపైన జరుగుతోంది. రాజకీయ నాయకులు , మీడియా మొత్తం స్థానిక సంస్థల ఎన్నికల పైనే దృష్టి పెట్టాయి.

విగ్రహాల అంశం పై చర్చ మొత్తం పక్కకు వెళ్ళిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికల  అంశం వైసీపీ కి కాస్త ఇబ్బంది అయినా, ఇప్పటి వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన హిందుత్వం అంశంలో మాత్రం కాస్త ఊరట లభించినట్లే అయ్యింది.

ఈ రకంగా అయినా నిమ్మగడ్డ వైసిపి కి కాస్త మేలు చేసినట్టే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube