ట్రోలర్స్ పై ఫైర్ అయిన బిగ్ బాస్ బ్యూటీ.. కారణమిదే..?

హిందీలో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 14లో పాల్గొని హిందీతో పాటు ఇతర భాషల్లో సైతం నిక్కీ తంబోలి గుర్తింపును సొంతం చేసుకున్నారు.కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు కోల్పోగా నిక్కీ తంబోలి సోదరుడు జతిన్ సైతం గత వారం ప్రాణాలు కోల్పోయారు.

 Nikki Tamboli Slams Trolls Shaming Her For Enjoying Days After Her Brothers Demise-TeluguStop.com

కేవలం 29 సంవత్సరాల వయస్సులో జతిన్ ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.జతిన్ చనిపోయి వారం రోజులైంది.

అయితే సోదరుడు చనిపోయిన కొన్ని రోజులకే నిక్కీ తంబోలి ఒక రియాలిటీ షో షూటింగ్ కొరకు దక్షిణాఫ్రికాకు వెళ్లారు.నిక్కీతో పాటు అక్కడికి ఆమె సహపోటీదారులు సైతం వెళ్లారు.

 Nikki Tamboli Slams Trolls Shaming Her For Enjoying Days After Her Brothers Demise-ట్రోలర్స్ పై ఫైర్ అయిన బిగ్ బాస్ బ్యూటీ.. కారణమిదే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే జతిన్ చనిపోయిన కొన్నిరోజులకే నిక్కీ షూటింగ్ లకు హాజరు కావడంపై ప్రేక్షకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.సోదరుడు చనిపోయాడనే బాధ ఉన్నా షూటింగ్ లకు హాజరై ఆమె ప్రొఫెషనల్ గా వ్యవహరించిందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేశారు.

అయితే మరి కొందరు మాత్రం సోదరుడు చనిపోయిన కొన్ని రోజులకే ఎంజాయ్ చేస్తుందంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు.అయితే అలా ట్రోల్ చేస్తున్న వాళ్ల పై నిక్కీ తంబోలి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.తనపై కొంతమంది ఇడియట్స్ ట్రోల్ చేస్తున్నారని తనకు కూడా ఒక జీవితం ఉందని తనకోసం కాకపోయినా తను సంతోషంగా ఉండాల్సి ఉంటుందని ఆమె పేర్కొన్నారు.తాను సంతోషంగా ఉంటేనే తన బ్రదర్ తనను ఇష్టపడతారని ఆమె పేర్కొన్నారు.

కామెంట్లు చేయడం కోసం నెగిటివిటీని స్ప్రెడ్ చేయడం కొరకు కొంతమంది కామెంట్లు చేస్తున్నారని అలాంటి వాళ్లు తన లక్ష్యాలను సాధించుకోవాలని ఆమె సూచనలు చేశారు.మీరు మీ లక్ష్యాలను సాధిస్తే మీ తల్లిదండ్రులు, ప్రేమించే వ్యక్తులు సంతోషంగా ఉంటారని ఆమె పేర్కొన్నారు.

ఘాటుగా స్పందించి నిక్కీ తంబోలి ట్రోలర్స్ సైలెంట్ అయ్యేలా చేశారు.

#Shaming Her #Brothers Demise #Nikki Tamboli #EnjoyingDays

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు