ట్రంప్ కోసం ప్రచారం: ఆమెను రంగంలోకి దించిన రిపబ్లికన్లు  

Nikki Haley, campaign for US President & Republican presidential nominee Donald Trump, Donald Trump, US President, Republican Presidential Nominee, - Telugu Campaign For Us President & Republican Presidential Nominee Donald Trump, Donald Trump, Nikki Haley, Republican Presidential Nominee, Us President

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది.పట్టుమని పది రోజులు కూడా వ్యవధి లేకపోవడంతో డెమొక్రాట్లు, రిపబ్లికన్లు ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

TeluguStop.com - Nikki Haley Supports Trump

కరోనా బారినపడి తిరిగి కోలుకున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ర్యాలీల్లో దూసుకెళ్తున్నారు.అదే సమయంలో తొలి నుంచి వ్యూహాత్మకంగా అడుగులు వేయడంతో పాటు సర్వేల్లో సానుకూల వాతావరణం వుండటంతో డెమొక్రాట్ నేత జో బిడెన్‌ మంచి జోరు మీదున్నారు.
అమెరికాలో పెద్ద సంఖ్యలో స్థిరపడిన ప్రవాస భారతీయుల ఓటు బ్యాంకు డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో వారిని ప్రసన్నం చేసుకోవడానికి రెండు పార్టీలూ భారత సంతతి నేతల్నే రంగంలోకి దించుతున్నాయి.ఇటు భారతీయ సమాజం సైతం రెండుగా విడిపోయింది.

మనోళ్లు రిపబ్లికన్లు, డెమొక్రాట్లకు మద్ధతుగా వేర్వేరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ కోసం భారత సంతతికి చెందిన నిక్కీ హేలీని రంగంలోకి దించారు రిపబ్లికన్లు.

TeluguStop.com - ట్రంప్ కోసం ప్రచారం: ఆమెను రంగంలోకి దించిన రిపబ్లికన్లు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

గతంలో ఐక్యరాజ్యసమితిలో అమెరికా అంబాసిడర్‌గా పనిచేసిన ఆమెకు అగ్రరాజ్యంలోని ఇండియన్ అమెరికన్ సమాజంలో మంచి గుర్తింపు వుంది.దక్షిణ కరోలినా నుంచి రెండు సార్లు గవర్నర్‌గా పనిచేయడంతో పాటు కేబినెట్‌లో చోటు దక్కించుకున్న మొట్టమొదటి భారత సంతతి మహిళగా నిక్కీ చరిత్ర సృష్టించారు.

ఈ క్రమంలో ఇండియన్ వాయిస్ ఫర్ ట్రంప్ పేరుతో ఇండియన్ అమెరికన్లు నిక్కీహేలీ సారథ్యంలో శనివారం ఫిలడెల్ఫియాలో భారీ ప్రచార సభను నిర్వహించారు.ఈ సందర్భంగా నిక్కీ మాట్లాడుతూ… ఉగ్రవాదాన్ని అణచివేయడానికి పాకిస్తాన్‌కు ఇదివరకటి ప్రభుత్వాలు నిధులు మంజూరు చేశాయని, డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వాటిని నిలిపివేసిందని నిక్కీ తెలిపారు.

అమెరికా సైనికులను అంతం చేసేందుకే పాకిస్తాన్ ఆ నిధులను వినియోగిస్తుందని ఆమె ఆరోపించారు.ఒకవేళ ప్రభుత్వం మారిపోతే మళ్లీ పాకిస్తాన్‌కు నిధుల ప్రవాహం కొనసాగుతుందని నిక్కీ హెచ్చరించారు.

గడిచిన 15 ఏళ్లుగా అమెరికా ప్రభుత్వాలు పాకిస్తాన్‌కు 33 బిలియన్ డాలర్ల నిధులను మంజూరు చేశాయని ఆమె గుర్తుచేశారు.పాకిస్తాన్, చైనా వంటి భారత వ్యతిరేక దేశాలను ట్రంప్ ఏకాకిని చేస్తున్నారని.

ట్రంప్ కాకుండా మరొకరు అధ్యక్షుడైతే ఈ దేశాలు మళ్లీ బలం పుంజుకుంటాయని ఆమె చెప్పారు.ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకోకుండా ట్రంప్ మరోసారి అధికారంలోకి రావాల్సిన అవసరం వుందని నిక్కీ హేలీ అభిప్రాయపడ్డారు.

#CampaignFor #Donald Trump #Nikki Haley #US President

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nikki Haley Supports Trump Related Telugu News,Photos/Pics,Images..