2024 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పోటీ చేస్తే .. నేను తప్పుకుంటా: నిక్కీ హేలీ ప్రకటన

అమెరికాలో ప్రభావశీలురైన భారత సంతతి మహిళా నేతల్లో ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ తర్వాత అంత గుర్తింపు తెచ్చుకున్న వారు నిక్కీ హేలీ.డెమోక్రాట్లు ఉపాధ్యక్ష పదవికి కమలా హారిస్ ను ఎంపిక చేసి, ఆమెనే 2024 అధ్యక్ష ఎన్నికల్లో తమ తరఫున నిలపాలని భావిస్తున్న వేళ, భారత సంతతికే చెందిన నిక్కీ హేలీ అయితేనే గట్టి పోటీ ఉంటుందని రిపబ్లికన్లు భావిస్తున్నారు.

 Nikki Haley Says Won't Run For President In 2024 If Trump Does, Nikki Haley,pres-TeluguStop.com

అలాగే గెలుపు అవకాశాలు కూడా గట్టిగా ఉంటాయని రిపబ్లికన్లు అంచనా వేస్తున్నారు.దీంతో 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇద్దరు భారత మూలాలున్న మహిళలు పోటీ చేస్తారని అప్పుడే ప్రచారం మొదలైంది.ఈ నేపథ్యంలో నిక్కీహేలీ ఓ సంచలన ప్రకటన చేశారు.

2024 ఎన్నికల్లో ట్రంప్ మళ్లీ బరిలోకి దిగితే.మద్ధతుగా వుంటాను కానీ ఆయనకు వ్యతిరేకంగా పోటీ చేయనని తేల్చిచెప్పారు.దీని గురించి అవసరమైతే ట్రంప్‌తో మాట్లాడతానని హేలీ స్పష్టం చేశారు.కాగా, జనవరి 6న జరిగిన క్యాపిటల్ దాడి నేపథ్యంలో ఆమె ట్రంప్‌పై విరుచుకుపడ్డారు.రిపబ్లికన్ నేషనల్ కమిటీ అంతర్గత సమావేశంలో నిక్కీ హేలీ మాట్లాడుతూ.

క్యాపిటల్ భవనంపైకి దాడి చేసేలా ప్రేరేపించిన ట్రంప్ వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు.ఆయన ఎప్పుడూ సరైన పదాలను ఉపయోగించలేదని.

మాజీ అధ్యక్షుడి చర్యలను చరిత్ర కఠినంగా పరిగణిస్తుందని వ్యాఖ్యానించారు.అయితే ట్రంప్ ఖాతాను శాశ్వతంగా బ్లాక్ చేస్తూ ట్విట్టర్ తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం నిక్కీ హేలీ ఖండించారు.

అమెరికా.ఇది చైనా కాదు’ అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

కానీ తర్వాత కొద్దిరోజుల్లోనే నిక్కీ హేలీ ఆయనను ప్రశంసించడం విశేషం.ఆమెతో పాటు ట్రంప్ మిత్రులైన హౌస్ మైనారిటీ నేత కెవిన్ మెక్‌కార్తి, ఆర్ కాలిఫ్, సెనేటర్లు టెడ్ క్రజ్, ఆర్ టెక్స్ తదితరులు ఆయనను తొలుత విమర్శించినా.

తర్వాత సమర్ధించారు.

Telugu Donald Trump, Joe Biden, Nikki Haley, Nikkihaley-Telugu NRI

భారత్‌లోని పంజాబ్ రాష్ట్రం అమృత్‌సర్‌కు చెందిన నిక్కీహేలీ అసలు పేరు నమ్రతా నిక్కీ రణధవా.ఆమె తల్లిదండ్రులు అజిత్ సింగ్, రాజ్‌కౌర్.క్లెమ్సన్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ అందుకున్న నిక్కీ హేలీ.ఎఫ్‌సీఆర్ కార్పోరేషన్‌లో ఉద్యోగం చేశారు.1996లో మిచెల్ హేలీని పెళ్లాడిన ఆమె.రాజకీయాల్లో చురుకుగా వుండేవారు.దక్షిణ కరొలినా గవర్నర్ గా రెండు సార్లు పనిచేసి సంచలనం సృష్టించారు.

అంతే కాకుండా దక్షిణ కరోలినాకు తొలి మహిళా గవర్నరుగా నిక్కీ రికార్డుల్లోకెక్కారు.ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారిగా బాధ్యతలు నిర్వర్తించారు.

తాను భారత్ నుంచి వచ్చిన వలసదారుల అమ్మాయినని చెప్పుకోవడానికి గర్వపడుతున్నానని నిక్కీ హేలీ పలు సందర్భాల్లో చెప్పారు.తన తల్లిదండ్రులు అమెరికాకు వచ్చి, చిన్న పట్టణంలో స్థిరపడ్డారని… తన తండ్రి టర్బన్ ధరిస్తారని, తన తల్లి ఇప్పటికీ చీర కట్టుకుంటారని తెలిపారు.

తన తల్లి విజయవంతమైన వ్యాపారస్తురాలిగా నిలిచారని, తన తండ్రి నల్లవారి కాలేజీగా పేరున్న చోట, 30 ఏళ్లు పాఠాలు చెప్పారని నిక్కీ హేలీ వెల్లడించారు.సౌత్ కరోలినా ప్రజలు, తొలి మైనారిటీ, తొలి మహిళగా గవర్నర్ గా తనను ఎన్నుకుని ఘనమైన గౌరవాన్ని ఇచ్చారని తరచుగా చెప్పేవారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube