చైనా అబద్దాల పుట్ట..భారతీయ అమెరికన్ నిక్కీ హెలీ...!!!!

అమెరికా రిపబ్లికన్ పార్టీ కీలక నేత.ట్రంప్ కి అత్యంత సన్నిహితురలిగా పేరొందిన భారత సంతతికి చెందిన నిక్కీ హెలీ చైనా పై మండిపడ్డారు.

 Nikki Haley China Coronavirus Figures, Nikki Haley, China, Coronavirus, Usa, Rep-TeluguStop.com

కరోనా కారణంగా తమ దేశంలో 3300 మంది మాత్రమే చనిపోయారని చైనా చెప్పడం ఎన్నో అనుమానాలకి తావిస్తోందని అన్నారు.చైనా కావాలనే వాస్తవాలని దాచిపెడుతోందని నిక్కీ హెలీ ఆరోపించారు.

చైనా వాస్తవాలని దాచిపెట్టింది కాబట్టే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఈ వైరస్ బారిన పడి మృతి చెందారని మండిపడ్డారు.
వాస్తవానికి చైనాలో కరోనా కేసులు బయటపడిన రెండు నెలలకి అమెరికాకి ఈ వైరస్ వచ్చిందని ఇప్పటికి అమెరికాలో మృతుల సంఖ్య 5వేలకి పైగానే నమోదు అయ్యింది.దాదాపు 2.5 లక్షల మంది ఈ వైరస్ బారిన పడి మృత్యువుతో పోరాడుతున్నారు.ఇలాంటి సమయంలో చైనా తమ దేశ మృతుల సంఖ్యని తక్కువ చేసి చెప్పడం వెనుక కారణాలు అనేకం ఉన్నయాని తన ప్రతిష్టని కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోందని నిపుణులు అంటున్నారు.ఇదిలాఉంటే

Telugu China, Coronavirus, Nikki Haley, Nikkihaley, Ambassador-

చైనాలో కరోనా బారినపడి మృతి చెందిన వారి సంఖ్య సుమారు 42 వేలకి పైగానే ఉందని వార్తలు వెలుగులోకి వచ్చాయి.యూరప్ లో వేలాదిమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.ఇలాంటి పరిస్తులలో ఈ వైరస్ పుట్టిన చైనాలో ఇంత తక్కువ మరణాలు నమోదు కావడం ఎలా సాధ్యమని నిక్కీ హెలీ అన్నారు.

ఇదిలాఉంటే అమెరికా గూఢచారి సంస్థ సిఐఏ చైనా మాటలు నమ్మద్దు అంటూ సూచించిన నేపధ్యంలో నిక్కీ హెలీ వ్యాఖ్యలపై ఆశక్తినెలకొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube