కరోనా లాజిక్ ఏమిటో అడుగుతున్న కొత్త పెళ్లికొడుకు  

Nikhil Wedding - Telugu Corona, Lockdown, Nikhil,, Tollywood News

టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ హీరో నిఖిల్, ప్రస్తుతం తన నెక్ట్స్ చిత్రంగా కార్తికేయ సీక్వెల్‌ను రెడీ చేసే పనిలో పడ్డాడు.ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్‌గా లాంఛ్ చేసిన నిఖిల్ షూటింగ్‌ను శరవేగంగా జరపాలని భారీ ప్లాన్ వేశాడు.

 Nikhil Wedding

కానీ అతడి ఆశలపై కరోనా నీళ్లు జల్లింది.దీంతో లాక్‌డౌన్ పూర్తవ్వగానే ఈ సినిమాను పట్టాలెక్కించాలని చూస్తున్నాడు.

కాగా లాక్‌డౌన్ వల్ల అటు వ్యక్తిగత జీవితంలోనూ ఈ హీరోకు కొన్ని మార్పులు చేసుకోవాల్సి వచ్చింది.తాను ప్రేమించిన అమ్మాయిని ఏప్రిల్ నెలలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవాలని అనుకున్నా, కరోనా భయంతో కేవలం సన్నిహితుల మధ్య వివాహమాడాడు ఈ హీరో.

కరోనా లాజిక్ ఏమిటో అడుగుతున్న కొత్త పెళ్లికొడుకు-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కాగా లాక్‌డౌన్ గురించి తాజాగా ఓ ఆసక్తికరమైన కామెంట్ చేశాడు.‘దేశంలో 10 కరోనా కేసులు ఉన్నప్పుడు పూర్తి లాక్‌డౌన్‌ను పాటించిన జనం, ఇప్పుడు 2 లక్షలకుపైగా కరోనా కేసులు ఉన్నా మనం ఫ్రీగా ఉన్నాం.

లాజిక్ ఏంటి అంటారు?’ అంటూ ప్రశ్నించాడు.

ఇక నిఖిల్ వేసిన ప్రశ్న ఆయన ఒక్కడిది కాదని, ప్రజలందరి ప్రశ్న అంటూ నెటిజన్లు ఆయనకు సపోర్ట్ ఇస్తున్నారు.

కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు రెండు నెలలకు పైగా లాక్‌డౌన్ పాటించిన ప్రభుత్వాలు, ఇప్పుడు కరోనా విజృంభిస్తున్న తరుణంలో లాక్‌డౌన్‌ను ఎత్తేయడం ఏమిటో అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఏదేమైనా లోగుట్టు పెరుమాళ్లకే ఎరుక అంటున్నారు పలువురు నెటిజన్లు.

ఇక నిఖిల్ కార్తికేయ సీక్వెల్ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి బాక్సాఫీస్ వద్ద రిలీజ్ చేసి మరోసారి అదిరిపోయే సక్సెస్‌ను అందుకోవాలని చూస్తున్నాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nikhil Wedding Related Telugu News,Photos/Pics,Images..

footer-test