పెళ్లి కూతురుతో నిఖిల్‌ రొమాన్స్‌

‘హ్యాపీడేస్‌’లో చిన్న పాత్రతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన నిఖిల్‌ ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోల జాబితాలో చేరి పోయాడు.ఈయన నటించిన ‘స్వామిరారా’, ‘కార్తికేయ’, ‘సూర్య వర్సెస్‌ సూర్య’ చిత్రాలు సక్సెస్‌ అయ్యాయి.

 Nikhil To Romance Tapsee And Avika-TeluguStop.com

ఈయన తాజాగా నటించిన ‘శంకరాభరణం’ వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఆ సినిమా కూడా తప్పకుండా విజయం సాధించవచ్చని సినీ వర్గాల వారు అంటున్నారు.

ఇంతటి సక్సెస్‌ జోష్‌లో ఉన్న నిఖిల్‌ మరో సినిమాకు ఓకే చెప్పాడు.ఆ సినిమాలో ఈయన ఇద్దరు ముద్దుగుమ్మలతో రొమాన్స్‌ చేయబోతున్నాడు.

అందులో మొదటగా తాప్సి కాగా రెండవ హీరోయిన్‌ ‘చిన్నారి పెళ్లి కూతురు’ ఫేం అవికా గౌర్‌.

‘టైగర్‌’ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు ఆనంద్‌ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతుంది.

‘శంకరాభరణం’ చిత్రం విడుదలైన వెంటనే ఈ కొత్త సినిమాను సెట్స్‌ పైకి తీసుకు వెళ్లబోతున్నట్లుగా నిఖిల్‌ చెబుతున్నాడు.కథానుసారంగా ఈ సినిమాకు ఇద్దరు హీరోయిన్స్‌ చాలా ముఖ్యం కనుకే ఎంపిక చేయడం జరిగిందని, పాత్రల స్వభావం రీత్యా తాప్సి మరియు అవికాను ఎంపిక చేశాం అని దర్శకుడు ఆనంద్‌ చెప్పుకొచ్చాడు.

వీరిద్దరిని నిఖిల్‌కు జోడీగా ఎందుకు ఎంపిక చేశాం అనేది సినిమా చూస్తే అర్థం అవుతుందని ఆయన చెప్పుకొచ్చాడు.వరుసగా సక్సెస్‌లు రావడంతో అవకాశాలు భారీగా వస్తున్న అవికాకు ఈ చిత్రం కూడా తప్పకుండా సక్సెస్‌ను ఇస్తుందేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube