నిఖిల్ పెళ్లి ఓకే.. మరి హనీమూన్?  

Nikhil To Postpone His Honeymoon - Telugu Dr Pallavi, Honeymoon, Karthikeya 2, Marriage, Nikhil, Telugu Movie News

యంగ్ హీరో నిఖిల్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.ఈ హీరో తాజాగా ‘కార్తికేయ 2’ చిత్రాన్ని ప్రారంభించాడు.

 Nikhil To Postpone His Honeymoon

ఇక వరుస హిట్లు కొట్టిన ఈ హీరో అటు పర్సనల్ జీవితంలోనూ తనదైన మార్క్‌తో ముందుకెళ్తున్నాడు.ఇప్పటికే డా.పల్లవితో ఎంగేజ్‌మెంట్ జరుపుకున్న నిఖిల్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు.

భీమవరంకు చెందిన డా.పల్లవి వర్మను నిఖిల్ ప్రేమించి పెళ్లాడనున్నాడు.గతకొంత కాలంగా వీరిద్దరు ప్రేమాయణం కొనసాగించగా, ఇటీవల వారింట్లో వారు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

నిఖిల్ పెళ్లి ఓకే.. మరి హనీమూన్-General-Telugu-Telugu Tollywood Photo Image

దీంతో ఇప్పుడు వీరిద్దరి పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఏప్రిల్ 16న హైదరాబాద్‌లో వీరి వివాహం జరగనున్నట్లు నిఖిల్ తెలిపాడు.

అయితే తనకు ప్రస్తుతం కార్తికేయ 2 చిత్రాన్ని పూర్తి చేసే పనే ముఖ్యం అని అంటున్నాడు నిఖిల్.అటు పెళ్లి చేసుకున్నప్పటికీ తాను సినిమాను దసరాకు రిలీజ్ చేస్తానని అంటున్నాడు ఈ హీరో.

అయితే పెళ్లి మాట ఓకే, మరి హనీమూన్ సంగతేమిటి అనే ప్రశ్నకు, ప్రస్తుతానికి దాన్ని హోల్డ్‌లో పెట్టామని చెప్పుకొచ్చింది నిఖిల్-పల్లవి జంట.ఏదేమైనా అటు కెరీర్, ఇటు పర్సనల్ లైఫ్‌లో బిజీగా ఉన్న నిఖిల్ అన్ని పక్కా ప్లానింగ్‌తో ముందుకు వెళ్తున్నాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు