టిక్‌టాక్ బ్యాన్ చేయొద్దంటున్న యంగ్ హీరో

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ఎప్పుడూ సినిమాలే కాకుండా సమాజంలోని పరిస్థితులపై కూడా స్పందిస్తూ ఉంటాడు.కాగా ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ప్రజలు నానా అవస్థలు పడుతున్న సందర్భంలో ఆయన పలుమార్లు ప్రజలను అప్రమత్తం చేసేందుకు ప్రయత్నించాడు.

 Nikhil Says Tiktok Should Not Banned, Nikhil, Tiktok, China App, Government Of I-TeluguStop.com

కాగా ఇటీవల చైనా-భారత్ సరిహద్దులో జరిగిన గొడవల కారణంగా భారత ప్రభుత్వం ఓ కఠిన నిర్ణయం తీసుకుంది.

చైనాకు చెందిన 59 యాప్‌లను బ్యాన్ చేస్తున్నట్లు భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

దీంతో టిక్‌టాక్ యాప్ లాంటి ప్రముఖ యాప్‌లన్నీ నిషేధింపబడ్డాయి.అయితే టిక్‌టాక్‌ను బ్యాన్ చేసినందుకు కొందరు హర్షిస్తుంటే, మరికొందరు మాత్రం టిక్‌టాక్ లాంటి యాప్‌లు నిషేధించినంత మాత్రాన అసలు సమస్య పరిస్కారం అవుతుందా అని వారు ప్రశ్నిస్తున్నారు.

ఇప్పుడు యంగ్ హీరో నిఖిల్ కూడా ఇదే తరహాలో టిక్‌టాక్ యాప్‌ను బ్యాన్ చేయడం కరెక్ట్ కాదని ఆయన అన్నారు.

అయితే నిఖిల్ చేసిన వ్యాఖ్యలపై మిశ్రమ స్పందన వస్తుంది.

టిక్‌టాక్ యాప్‌ను నిషేధించడం ఏమిటని పలువురు కామెంట్ చేస్తుంటే, చైనాకు సంబంధించినది ఏదైనా బ్యాన్ చేయాల్సిందే అని వారు అంటున్నారు.ఏదేమైనా టిక్‌టాక్ బ్యాన్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందనేది వాస్తవం.

ఇక నిఖిల్ చేసిన కామెంట్స్‌ను పక్కనబెడితే, ప్రస్తుతం కార్తీకేయ-2 అనే సినిమాలో ఆయన హీరోగా నటస్తోన్న సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube