ఆయన సినిమాల గురించి వర్రీ అవుతున్న నిఖిల్.. ఎందుకంటే!

టాలీవుడ్ లో ఉన్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో నిఖిల్ సిద్ధార్థ్ ఒకరు.ఈయన హ్యాపీడేస్ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి వరస విజయాలు సాధించి ప్రేక్షకులను అలరించాడు.

 Nikhil Siddharth Worried About His Movies Release , Nikhil Siddharth , Movie Release , Tollywood , Covid-19 , Arjun Suravaram , Karthikeya-TeluguStop.com

తనకంటూ ప్రత్యేక మైన మార్క్ సెట్ చేసుకున్న నిఖిల్ ఇప్పుడు ఒక విషయం గురించి బాధ పడుతున్నాడు.మాములుగా తన నుండి సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తారు.

కార్తికేయ సినిమాతో టాలీవుడ్ లో మరింత గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్. ఈ సినిమా తర్వాత ఈయన ఏ సినిమా చేసిన మినిమమ్ గ్యారెంటీ గా రావడమే కాకుండా ఒక కొత్త థ్రిల్లింగ్ సబ్జెక్టు తో వస్తాడనే నమ్మకం ఆడియెన్స్ లో కలిగించాడు.

 Nikhil Siddharth Worried About His Movies Release , Nikhil Siddharth , Movie Release , Tollywood , Covid-19 , Arjun Suravaram , Karthikeya-ఆయన సినిమాల గురించి వర్రీ అవుతున్న నిఖిల్.. ఎందుకంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ ఇప్పుడు నిఖిల్ తన సినిమా రిలీజ్ పట్ల కాస్త వర్రీ అవుతున్నట్టు తెలుస్తుంది.తన లాస్ట్ సినిమా అర్జున్ సురవరం తర్వాత మరొక సినిమా రిలీజ్ చేయని నిఖిల్ ఇప్పుడు రిలీజ్ చేయడానికి ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు.

ఆ సినిమా తర్వాత నిఖిల్ 4 ప్రాజెక్ట్స్ ఓకే చేసినట్టు ఈ యంగ్ హీరో సోషల్ మీడియా వేదికగా చెబుతున్నాడు.ఈయన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ”నా లాస్ట్ సినిమా అర్జున్ సురవరం తర్వాత నాలుగు ప్రాజెక్ట్స్ ను ఓకే చేశాను.

ఆ నాలుగు సినిమా స్క్రిప్ట్ లు కూడా బ్రిలియంట్ గా ఉంటాయి.కానీ ఈ ప్యాండమిక్ మూలాన అందరి కెరీర్ లు నాశనం అవుతున్నాయి” అంటూ నిఖిల్ బాధ పడుతున్నాడు.

ఇది చాలా బాధాకరమైన విషయం అని.అలాగే తన సినిమాలు అన్నింటిపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న కూడా రిలీజ్ లే అర్ధం కానీ పరిస్థితిలో మారాయని వాపోతున్నాడు.దేవుడి దయ వల్ల ఈ సమస్యలు అన్ని క్లియర్ అయ్యి మా సినిమాలు త్వరలోనే రిలీజ్ కావాలని అనుకుంటున్నాను అంటూ నిఖిల్ తన బాధను పంచుకున్నాడు.మరి మళ్ళీ థర్డ్ వేవ్ వస్తున్న సమయంలో ఎప్పుడు అంతా మాములుగా మారుతుందో వేచి చూడాల్సిందే.

https://twitter.com/actor_Nikhil/status/1486485525431128065?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1486485525431128065%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fd-910789020615884337.ampproject.net%2F2201141909003%2Fframe.html

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube