జోరుమీదున్న యంగ్ హీరో నిఖిల్

హ్యాపీ డేస్ సినిమాలో హీరోల గ్యాంగ్ లో ఒకడిగా కనిపించిన నిఖిల్ తరువాత కమర్షియల్ హీరోగా అవ్వాలనే ప్రయత్నంలో తన ఇమేజ్ కి మించిన కథలతో సినిమాలు చేసి బోర్లా పడ్డాడు.అయితే స్వామీ రారా సినిమా సినిమా కంప్లీట్ గా జోనర్ మార్చి సినిమాలు చేయడం స్టార్ట్ చేశాడు.

 Nikhil Siddharth Signed 3 More Movies-TeluguStop.com

స్వామి రారా మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి వెంటనే కార్తికేయ మూవీతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ని ఖాతాలో వేసుకున్నాడు.ఈ రెండు సినిమాలతో తన ప్రయాణం ఎలా ఉండబోతుందో అనే విషయాన్ని నిఖిల్ అందరికి చూపించేశాడు.

ఆ రెండు సినిమాల తర్వాత వీలైనంత వరకు డీసెంట్ కాన్సెప్ట్ లకే నిఖిల్ ఓటు వేస్తూ వస్తున్నాడు. స్ట్రాంగ్ కంటెంట్, డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్న కథలకి ప్రాధాన్యత ఇస్తూ తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు.

 Nikhil Siddharth Signed 3 More Movies-జోరుమీదున్న యంగ్ హీరో నిఖిల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అలాగే ఫన్ అండ్ ఎంటర్టైనర్ కథలని కూడా చేస్తూ హిట్స్ కొట్టాడు.ఇప్పుడు 18 పేజెస్ అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీని గీతా ఆర్ట్స్2 బ్యానర్ లో చేస్తున్నారు.

ఈ మూవీకి సుకుమార్ కథ అందించాడు.దీని తర్వాత చందూ మొండేటి దర్శకత్వంలో కార్తికేయ సీక్వెల్ లో నటిస్తున్నాడు.ఈ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.ఈ రెండు సినిమాల మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఆగష్టులో 18 పేజెస్ మూవీ ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశం ఉంది.ఇక నిఖిల్ నటిస్తున్న రెండు సినిమాలలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఇదిలా ఉంటే పెళ్లి తర్వాత నిఖిల్ మరిన్ని కొత్త కథలని విన్నట్లు తెలుస్తుంది.థ్రిల్లర్ జోనర్ కథలకి ప్రాధాన్యత ఇస్తూ పెద్ద ప్రొడక్షన్ హౌస్ లలో ఏకంగా మూడు సినిమాలని బ్యాక్ టూ బ్యాక్ లైన్ లో పెట్టినట్లు టాక్ వినిపిస్తుంది.లాక్ డౌన్ తర్వాత ఈ సినిమాల గురించి సమాచారం బయటకొచ్చే అవకాశం ఉంది.

#18 Pages Movie #Geeta Arts #Chandoo Mondeti

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు