కరోనా సమయంలో తనవంతు సాయం చేస్తున్న నిఖిల్ ?

హ్యాపీడేస్ సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు నిఖిల్ సిద్దార్థ్.తర్వాత తన నటనతో ఆకట్టుకుంటూ వరుస విజయాలను సొంతం చేసుకున్నాడు.కానీ ఈ మధ్య ప్లాపులు రావడంతో కాస్త వెనుకబడ్డాడు.నిఖిల్ నటించిన కార్తికేయ సినిమాతో టాలీవుడ్ లో మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు.ఈ మధ్యనే పెళ్లి చేసుకుని పర్సనల్ లైఫ్ లో సెటిల్ అయిన నిఖిల్ ఇప్పుడు మంచి హిట్ కొట్టి ప్రొఫెషనల్ లైఫ్ కూడా సెట్ చేసుకోవాలని చూస్తున్నాడు.

 Nikhil Siddharth Helps Poor People In Corona Crisis-TeluguStop.com

ప్రస్తుతం నిఖిల్ కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా కార్తికేయ 2 సినిమా చేస్తున్నాడు.

చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయ 2 సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది.

 Nikhil Siddharth Helps Poor People In Corona Crisis-కరోనా సమయంలో తనవంతు సాయం చేస్తున్న నిఖిల్…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది.

ఈ సినిమాలో కూడా చందు మొండేటి మరొక కొత్త స్టోరీ లైన్ తో మన ముందుకు రాబోతున్నాడు.దాదాపు 5118 సంవత్సరాల క్రితం కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

అనంత సంపద కోసం జరిగే అన్వేషణ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.కార్తికేయ 2 సినిమాను మరింత భారీ బడ్జెట్ తో తీసుకు రాబోతున్నారు.

ఈ సినిమా తర్వాత మరికొన్ని సినిమాలను కూడా నిఖిల్ లైన్లో పెట్టాడు.

ఇది ఇలా ఉండగా ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశంలో నెలకొన్న పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి.

ఈ కష్ట సమయంలో ఇండస్ట్రీలో ప్రముఖులు తమవంతు సాయం చేస్తూ పేద ప్రజలను ఆడుకుంటున్నారు.అలాగే నిఖిల్ కూడా తనకు చేతనైన సహాయం చేస్తున్నాడు.

సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటూ పేదలకు అవసరమైన రక్తం అవసరం అయినా వారికీ రక్తం పంపించడం, ఆర్ధికంగా సహాయం కావాలంటే చేయడం, అత్యవసరమైన ఆక్సిజెన్ సిలిండరాలు, మందులు ఇలా చేయదగిన సహాయం చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.

#Corona Virus #NikhilSiddharth #Corona Crisis #Celebrities #HeroNikhil

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు