హీరో నిఖిల్‌ కు అంతలోనే జ్ఞానోదయం అయ్యిందా?

యంగ్‌ హీరో నిఖిల్‌ మెల్లగా సినిమాల్లో రాణిస్తూ గుర్తింపు దక్కించుకుంటున్నాడు.ఇలాంటి సమయంలో ఆయన దర్శకత్వంలో అడుగు పెడతాను అంటూ ప్రకటన చేయడం అందరిని ఆశ్చర్యపర్చింది.

 Nikhil Plan Change On His Directional Debut, Nikhil As Director, Film Makers, 18-TeluguStop.com

యంగ్‌ హీరోలు దర్శకులుగా మారిన సందర్బాలు చాలా తక్కువ.నిర్మాతలుగా మారి డబ్బులు పెట్టినా సరే కాని దర్శకులుగా రాణిస్తాం అంటే మాత్రం ఎవరు పట్టించుకోరు.

ఈ విషయం మరోసారి నిరూపితం అయ్యింది.తాజాగా నిఖిల్‌ తాను దర్శకత్వం చేయబోతున్నట్లుగా పేర్కన్నాడు.

పిల్లల కాన్సెప్ట్ తో ఒక సినిమాను తీసేందుకు సిద్దం అయ్యాడు.ఈ ఏడాది చివరి వరకు షూటింగ్స్‌కు వెళ్లే అవకాశం లేదు.

తన సినిమాలకు సమయం ఉంది కనుక ఈలోపు ఒక సినిమాను పూర్తి చేయాలని ఆయన భావించాడు.స్వతహాగా సహాయ దర్శకుడిగా చేసిన నిఖిల్‌ ఈసారి దర్శకుడిగా మారి కోరిక తీర్చకునేందుకు సిద్దం అయ్యాడు.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఎప్పుడైతే నిఖిల్‌ తన సినిమాకు సంబంధించి దర్శకత్వం వహించబోతున్నట్లుగా ప్రకటించాడో అప్పుడు వెంటనే ఆయన ప్రస్తుతం చేస్తున్న ఫిల్మ్‌ మేకర్స్‌ ఆయనపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు.దర్శకుడిగా నువ్వు చేస్తే అప్పుడు సినిమాల ఫలితంపై ప్రభావం పడుతుంది.

అందుకే మేము నీవు దర్శకత్వం వహించడంను ఒప్పుకోవడం లేదు అంటూ తేల్చి చెప్పారు.ఆ రెండు సినిమాల షూటింగ్స్‌ ఆలస్యం అవుతున్నా కూడా నిఖిల్‌ దర్శకుడిగా సినిమాలు చేస్తే పరిస్థితి మారిపోతుందని అంటున్నారు.

ప్రస్తుతం కార్తికేయ 2 మరియు 18 పేజెస్‌ సినిమాల్లో ఈయన నటిస్తున్న విషయం తెల్సిందే.ఈ రెండు సినిమాల మేకర్స్‌ నో చెప్పడం వల్లే వెంటనే నిఖిల్‌ తాను దర్శకత్వం చేయాలనుకుంటున్నట్లుగా ప్రకటించిన మాటను వెనక్కు తీసుకున్నాడు.

అందుకు కారణం కూడా వివరించాడు.దర్శకత్వంకు మరికొన్నాళ్ల సమయం ఉందని నేను భావిస్తున్నాను తెలుసుకోవాల్సింది ఇంకా ఉందని భావిస్తున్నాను అంటూ జ్ఞానోదయం అయినట్లుగా చెప్పుకొచ్చాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube