బాబోయ్‌.. ఈ చిన్న హీరో కూడా పాన్‌ ఇండియా సినిమా అంటున్నాడు

నిఖిల్‌ కెరీర్‌లో మంచి సినిమా అంటే ‘కార్తికేయ’ అని చెప్పుకోవచ్చు.ఆ సినిమా తర్వాత మళ్లీ వరుసగా ఫ్లాప్స్‌ను చవిచూశాడు.

 Hero Nikhil Want To Relase Karthikeya Movie In Five Languages, Nikhil, Karthikey-TeluguStop.com

ఇటీవలే అర్జున్‌ సురవరం చిత్రంతో కూడా నిరాశపర్చాడు.ప్రస్తుతం ఈయన దృష్టి అంతా కూడా కార్తికేయ 2 చిత్రంపైనే ఉంది.

మొదటి పార్ట్‌ను మించి ఈ చిత్రం ఉంటుందనే నమ్మకంను సినీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు నమ్ముతున్నారు.చిత్ర యూనిట్‌ సభ్యులు అప్పుడే సినిమాపై అంచనాలు పెంచడంలో సక్సెస్‌ అయ్యారు.

తాజాగా హీరో నిఖిల్‌ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ఈ సినిమా మంచి కంటెంట్‌ ఉన్న సినిమా తప్పకుండా ఆకట్టుకుంటుంది.కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా ఈ సినిమాను అన్ని భాషల వారు చూసే విధంగా అన్ని భాషల వారు మెచ్చుకునే విధంగా ఉటుందని ఆయన చెప్పుకొచ్చాడు.అందుకే సినిమాను ఇతర భాషల్లో కూడా విడుదల చేస్తామన్నాడు.

Telugu Hindhi, Kannada, Karthikeya, Malayalam, Nikhil, Nikhil Latest, Tamil, Tel

ఈ చిత్రంను తెలుగుతో పాటు కన్నడం, మలయాళం, తమిళ మరియు హిందీ భాషల్లో విడుదల చేస్తామంటూ ప్రకటించాడు.అన్ని భాషల్లో కూడా నేను డబ్బింగ్‌ చెప్తానంటూ నిఖిల్‌ ప్రకటించాడు.ఈ సినిమాతో నిఖిల్‌ పాన్‌ ఇండియా లెవల్‌లో గుర్తింపు దక్కించుకుంటానంటూ నమ్మకంగా చెబుతున్నాడు.మరి తెలుగులోనే ఆకట్టుకోలేక పోతున్న నికిల్‌ ఇతర భాషల్లో ఏమేరకు రాణిస్తాడు అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube