లాంఛ్‌కు రెడీ అయిన అదిరిపోయే సీక్వెల్  

Nikhil Karthikeya 2 Ready To Get Launch - Telugu Chandoo Mondeti, Karthikeya 2, Launch, Nikhil, Telugu Movie News

యంగ్ హీరో నిఖిల్ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు.చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ వాటిని సూపర్ హట్‌లు మలచడంలో నిఖిల్ తరువాతే ఎవరైనా అనే రేంజ్‌కు అతడు ఎదిగాడు.

Nikhil Karthikeya 2 Ready To Get Launch - Telugu Chandoo Mondeti, Karthikeya 2, Launch, Nikhil, Telugu Movie News-Gossips-Telugu Tollywood Photo Image

ఇటీవల అర్జున్ సురవరం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నిఖిల్ అదిరిపోయే సక్సెస్‌ను అందుకున్నాడు.ఇక తన కెరీర్‌ను మలుపు తిప్పిన కార్తికేయ చిత్రం సీక్వెల్‌ కోసం గత కొన్నాళ్లుగా నిఖిల్ రెడీ అవుతున్నాడు.

అయితే ఎట్టకేలకు ఈ సినిమా పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది.పూర్తి సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన కార్తికేయ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో, ఈ సీక్వెల్ మూవీ ఆ సినిమా స్థాయికి ఎక్కడా తగ్గకుండా దర్శకుడు చందూ ముండేటి అదిరిపోయే స్క్రిప్టును రెడీ చేసినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాను అధికారికంగా మార్చి 2న లాంఛ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.అటు వ్యక్తిగత జీవితంలోనూ నిఖిల్ మరో అడుగు ముందుకు వేయడానికి రెడీ అయ్యాడు.

త్వరలోనే తనకు నచ్చిన అమ్మాయితో వివాహానికి రెడీ అవుతున్నాడు ఈ కుర్ర హీరో.

మరి కార్తికేయ చిత్రానికి సీక్వెల్‌గా రాబోతున్న చిత్రంలో నిఖిల్‌తో పాటు మరెవరు నటిస్తున్నారనే అంశం తెలియాల్సి ఉంది.

ఇక ఈ సినిమాను వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలని నిఖిల్ అండ్ టీమ్ భావిస్తోందట.కార్తికేయ సీక్వెల్ కోసం కేవలం నిఖిల్ మాత్రమే కాకుండా ప్రేక్షకులు కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

తాజా వార్తలు

Nikhil Karthikeya 2 Ready To Get Launch-karthikeya 2,launch,nikhil,telugu Movie News Related....