Nikhil 18 pages : ఇంకా కార్తికేయ 2 సక్సెస్ నుంచి బయటకు రాని నిఖిల్.. 18 పేజెస్ ప్రమోషన్లో రచ్చ?

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ గురించి అందరికీ పరిచయమే.తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ హీరో అతి తక్కువ సమయంలో అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు.

 Nikhil Is Still Not Out Of The Success Of Karthikeya 2 Rachcha In 18 Pages Promo-TeluguStop.com

ఈ మధ్య మాత్రం వరుస అవకాశాలతో బాగా పరుగులు తీస్తున్నాడు.పైగా మంచి సక్సెస్ లతో మంచి క్రేజ్ సంపాదించుకుంటున్నాడు.

నిఖిల్ తొలిసారిగా సంబరం సినిమాలో చిన్న పాత్రతో ఇండస్ట్రీకి పరిచయమైయ్యాడు.ఆ తర్వాత హ్యాపీ డేస్ సినిమాలో నటించి తన నటనకు మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.

అలా పలు సినిమాలలో అవకాశాలు అందుకొని తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు.ముఖ్యంగా స్వామిరారా, ఎక్కడికి పోతావు చిన్నవాడా, కిరాక్ పార్టీ, అర్జున్ సురవరం సినిమాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ ప్రస్తుతం స్టార్ హోదా వైపు అడుగులు వేస్తున్నాడు.

ఇక ఇటీవలే విడుదలైన కార్తికేయ 2 తో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నాడు.ఈ సినిమా మంచి సక్సెస్ అందించింది.కార్తికేయ1 సినిమా ఎంత సక్సెస్ అందుకుందో చూసాం.ఇక ఆ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా రూపొందిగా మంచి ఇంట్రెస్టింగ్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అలా ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ప్రస్తుతం ఈయన ఖాతాలో మరిన్ని ప్రాజెక్టులు కూడా ఉన్నాయి.అందులో 18 పేజెస్ మూవీ ఒకటి.ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండటంతో సినీ బృందం ప్రమోషన్స్ భాగంలో బాగా బిజీగా ఉన్నారు.ఈ సినిమాకు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించాడు.

Telugu Pages, Anupama, Nikhil, Palnatisurya, Karthikeya, Swamy Ra Ra, Tolywood-M

జి ఏ టు పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై బన్నీ వాసు, అల్లు అరవింద్, సుకుమార్ నిర్మాతలుగా బాధ్యతలు చేపట్టారు.ఇందులో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది.ఇక ఈ సినిమాకు గోపి సుందర్ మ్యూజిక్ అందించాడు.అయితే ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్, ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.అయితే ఈ సినిమా గతంలో విడుదల చేయడానికి ప్రకటించగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.మొత్తానికి ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే ఈ సందర్భంగా ప్రమోషన్స్ జోరుగా కొనసాగుతున్నాయి.ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా.

ఇన్ స్టా లో ఈ సినిమా ప్రమోషన్ కి సంబంధించిన వీడియో వైరల్ అయింది.

Telugu Pages, Anupama, Nikhil, Palnatisurya, Karthikeya, Swamy Ra Ra, Tolywood-M

అందులో నిఖిల్ ఈ సినిమా ప్రమోషన్స్ గురించి మాట్లాడుతూ 18 పేజెస్ అని చెప్పకుండా కార్తికేయ 2 అని చెప్పటంతో పక్కనే ఉన్న అనుపమ ఆశ్చర్యపోతూ 18 పేజెస్ అని అందించింది.దీంతో ఆ వీడియో బాగా వైరల్ అవడంతో ఇంకా నిఖిల్ కార్తికేయ 2 సక్సెస్ నుంచి బయటికి రాలేదేమో అందుకే ఈ సినిమా సమయంలో కూడా కార్తికేయ 2 ను వదలట్లేదు అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు నెటిజన్స్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube