నో హనీమూన్‌.. అప్పుడే సినిమాతో బిజీ అయ్యాడట  

Nikhil Honeymoon Postponed Movies - Telugu Honeymoon, Karthikeya2, Nikhil, Nikhil Marriage, Pallavi Varma

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నిఖిల్‌ ఇటీవలే పల్లవి వర్మను వివాహం చేసుకున్న విషయం తెల్సిందే.సుదీర్ఘ కాలం ప్రేమించుకున్న వీరిద్దరు అంగరంగ వైభవంగా వివాహం చేసుకోవాలనుకున్నారు.

 Nikhil Honeymoon Postponed Movies

కాని కరోనా

లాక్‌ డౌన్

‌ కారణంగా మొదట వీరి వివాహం వాయిదా పడినది.లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నారు.

కాని లాక్‌డౌన్‌ను కొనసాగిస్తూనే వెళ్లడంతో ఇక తప్పదని పెళ్లికి రెడీ అయ్యారు.కొన్ని రోజుల క్రితం తక్కువ మంది బంధు మిత్రుల సమక్షంలో ఈ జంట ఒక్కటయ్యారు.

నో హనీమూన్‌.. అప్పుడే సినిమాతో బిజీ అయ్యాడట-Movie-Telugu Tollywood Photo Image

పెళ్లి తర్వాత దాదాపు నెల రోజుల పాటు విదేశాల్లో హనీమూన్‌ను ప్లాన్‌ చేయడంతో పాటు చాలా కార్యక్రమాలను నిఖిల్‌ దంపతులు అనుకున్నారట.కాని ఈ లాక్‌డౌన్‌ కారణంగా హనీమూన్‌ను క్యాన్సిల్‌ చేసుకున్నారు.

విదేశాలకు వెళ్లేందుకు విమాన సర్వీసులు లేకపోవడంతో పాటు దాదాపు అన్ని దేశాల్లో కూడా మహమ్మారి విజృంభిస్తున్న కారణంగా ప్రస్తుతానికి హనీమూన్‌ ప్లాన్‌ను పక్కన పెట్టేశారట.నిఖిల్‌ అప్పుడే సినిమాతో బిజీ అయ్యాడట.

కార్తికేయ 2 చిత్రం పనిలో మునిగి పోయాడు.అతి త్వరలో ఆ సినిమా షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది.కనుక అందుకు సంబంధించిన వర్కౌట్స్‌, సీన్స్‌ ప్రాక్టీస్‌, స్క్రిప్ట్‌ వర్క్‌ ఇలా పలు కార్యక్రమాలతో నిఖిల్‌ బిజీ బిజీగా గడిపేస్తున్నాడు.కనీసం నెల రోజులు అయినా గ్యాప్‌ తీసుకోకుండా నిఖిల్‌ బ్యాక్‌ టు వర్క్‌ అంటూ రావడం ఆయన సన్నిహితులను సైతం ఆశ్చర్యపర్చుతుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test