యువ హీరో నిఖిల్ చందు మొండేటి కాంబినేషన్ లో వస్తున్న సూపర్ హిట్ సీక్వల్ మూవీ కార్తికేయ 2.జూలై 22న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు నిఖిల్ సొంత డబ్బింగ్ చెబుతున్నారు.
సినిమా హిందీ లో కూడా గ్రాండ్ గా రిలీజ్ ప్లాన్ చేశారు.అందుకే ఫీల్ మిస్ అవకూడదని హీరో నిఖిల్ సిద్ధార్థ్ స్వయంగా హిందీలో డబ్బింగ్ చెబుతున్నారు.
దాదాపు హిందీలో డబ్బింగ్ చెప్పడం నిఖిల్ కి ఇదే మొదటిసారి కావొచ్చు.నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా నుంచి ఈమధ్య వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది.
తెలుగుతో పాటుగా సౌత్ అన్ని భాషలతోనూ హిందీలో కూడా కార్తికేయ 2 వస్తుంది.ఈ సినిమా విషయంలో చిత్రయూనిట్ చాలా కాన్ ఫిడెంట్ గా కనిపిస్తున్నారు.2014లో వచ్చిన కార్తికేయ సూపర్ హిట్ కాగా ఆ సినిమా సీక్వల్ గా వస్తున్న కార్తికేయ 2 పై భారీ అంచనాలు ఉన్నాయి.ఈ సినిమా తర్వాత నిఖిల్ సూర్య ప్రతాప్ డైరక్షన్ లో 18 పేజెస్ సినిమా చేస్తున్నాడు.
గీతా ఆర్ట్స్ 2 నిర్మిస్తున్న ఈ సినిమాకు సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందించారు.