పెళ్లి పీటలు ఎక్కబోతున్న యువ హీరో! బంధువుల అమ్మాయితోనే  

Buzz Over Nikhil Gowda\'s Wedding - Telugu Buzz Over, Jds, Kumaraswamy, Nikhil Gowda\\'s Wedding, Tollywood

నిఖిల్ గౌడ అంటే వెంటనే ఎవరికీ గుర్తురాకపోవచ్చు అయితే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు జాగ్వార్ నిఖిల్ గౌడ అంటే వెంటనే గుర్తు పడతారు.రీసెంట్ గా కర్ణాటకలోని సుమలత మీద ఎంపీగా కూడా నిఖిల్ గౌడ జేడీఎస్ తరుపున ఎన్నికలలో పోటీ చేసి ఘోరంగా ఓడిపోయాడు.

Buzz Over Nikhil Gowda's Wedding

ఓ వైపు రాజకీయాలలో ఉంటూ తండ్రికి చేదోడుగా నిలుస్తున్న నిఖిల్ మరో వైపు సినిమా హీరోగా కూడా ఎదిగే ప్రయత్నం చేస్తున్నాడు.తెలుగు, కన్నడ భాషలలో జాగ్వార్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్ర హీరో డాన్స్, ఫైట్స్ తో ఆకట్టుకున్న హీరోకి సరిపోయే లుక్స్ లేవనే విమర్శలు ఎదుర్కొన్నాడు.

రీసెంట్ గా కన్నడలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన కురుక్షేత్ర మూవీలో అభిమాన్యుడు పాత్రలో నిఖిల్ గౌడ మెప్పించాడు.ఇప్పుడు నిఖిల్ గౌడ గుండెఝారి గల్లంతయ్యిందే సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో బై లింగ్వల్ మూవీ ఒకే చేశాడు.

త్వరలో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే ఈ యువ హీరో త్వరలో పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అవుతున్నాడు.తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి సమీప బంధువే కావడం విశేషం.తన తల్లి కుటుంబానికి చెందిన అమ్మాయి పెళ్లి చేసుకుంటున్నట్లు తెలుస్తుంది.

దీనికి ముహూర్తాలు ఫైనల్ చేసే పనిలో తండ్రి కుమారస్వామి ఉన్నట్లు తెలుస్తుంది.

తాజా వార్తలు

Buzz Over Nikhil Gowda\'s Wedding-jds,kumaraswamy,nikhil Gowda\\'s Wedding,tollywood Related....