నిఖిల్, గ్యారీ బిహెచ్, ఎడ్ ఎంటర్‌ టైన్‌మెంట్స్ మల్టీ లాంగ్వేజ్ మూవీ ‘స్పై' పవర్ ఫుల్ ఇంట్రో గ్లింప్స్ విడుదల

యంగ్ ప్రామిసింగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కధానాయకుడి గా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మల్టీ లాంగ్వెజ్ చిత్రం ‘స్పై’.ఎవరు, గూడాచారి, హిట్ లాంటి సూపర్ హిట్ చిత్రాల ఎడిటర్ గా చేసిన గ్యారీ బిహెచ్ దర్శకత్వంలో ఎడ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై చరణ్ తేజ్ ఉప్పలపాటి సిఈఓగా నిర్మాత కె.

 Nikhil, Garry Bh, Ed Entertainments Multi-lingual Film Spy Intro Glimpse Out Spy-TeluguStop.com

రాజ శేఖర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

తాజాగా నిఖిల్‌ ని ‘స్పై’ గా పరిచయం చేస్తూ చిత్ర యూనిట్ ఒక గ్లింప్స్ వీడియోని విడుదల చేసింది.

చేతిలో ట్రాన్స్‌మిటర్‌ తో మంచు పర్వతాల మీద నడుస్తున్న నిఖిల్ వెపన్స్ వున్న రహస్య ప్రదేశాన్ని చేరుకోవడం, వెపన్స్ పట్టుకొని బైక్ నడుపుతూ శత్రువులను వేటాడడానికి రంగంలో దిగడం ఈ పవర్ ఫుల్ గ్లింప్స్ లో చూపించారు.ఇందులో నిఖిల్ స్లిక్, స్టైలిష్ , డాషింగ్‌ గా కనిపిస్తున్నారు.

లార్జర్ దేన్ లైఫ్ యాక్షన్ ఎంటర్‌ టైనర్ గా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం 2022 దసరాకి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.ఆర్యన్ రాజేష్ కొంత గ్యాప్ తర్వాత ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు.

ఇది అతనికి పర్ఫెక్ట్ రీ-ఎంట్రీ మూవీ అని చెప్పొచ్చు.నిఖిల్ సరసన ఐశ్వర్య మీనన్ కథానాయికగా నటిస్తుండగా, సన్యా ఠాకూర్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో భారీ బడ్జెట్‌ తో రూపొందుతున్న ఈ చిత్రానికి అత్యున్నత సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు.బాలీవుడ్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కైకో నకహరా, హాలీవుడ్ డిఓపి జూలియన్ అమరు ఎస్ట్రాడా డీవోపీ గా పని చేస్తున్నారు.

హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ లీ విటేకర్, రాబర్ట్ లీనెన్ యాక్షన్ సన్నివేశాలను పర్యవేక్షిస్తున్నారు.

పూర్తి యాక్షన్‌ స్పై థ్రిల్లర్‌గా భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రానికి నిర్మాత కె రాజశేఖర్ రెడ్డి కథను కూడా అందించారు.

శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా, అర్జున్ సూరిశెట్టి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.ఎడ్ ఎంటర్టైన్మెంట్స్ సిఈవోగా చరణ్ తేజ్ ఉప్పలపాటి ఈ ప్రాజెక్ట్ మొత్తం ప్రొడక్షన్ పనులను నిర్వహిస్తున్నారు.

తారాగణం:

నిఖిల్ సిద్ధార్థ్, ఆర్యన్ రాజేష్, ఐశ్వర్య మీనన్, అభినవ్‌ గోమతం, మకరంద్ దేశ్‌పాండే, సన్యా ఠాకూర్, జిషు సేన్‌గుప్తా, నితిన్ మెహతా, రవివర్మ తదితరులు

సాంకేతిక విభాగం:

దర్శకత్వం, ఎడిటర్: గ్యారీ బిహెచ్, కథ, నిర్మాత: కె రాజ శేఖర్ రెడ్డి , సీఈఓ: చరణ్ తేజ్ ఉప్పలపాటి, సమర్పణ: ఎడ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, రచయిత: అనిరుధ్ కృష్ణమూర్తి, సంగీతం: శ్రీచరణ్ పాకాల, డీవోపీ: జూలియన్ అమరు ఎస్ట్రాడా ఆర్ట్ డైరెక్టర్: అర్జున్ సూరిశెట్టి కాస్ట్యూమ్స్: రాగా రెడ్డి, అఖిల దాసరి, సుజీత్ కృష్ణన్,పీఆర్వో: వంశీ-శేఖర్

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube