కరోనా రాని గిరోనా రాని.. ఆగేది లేదంటున్న యంగ్ హీరో!  

Nikhil Does Not Want To Postpone Wedding - Telugu Dr Pallavi, Karthikeya 2, Nikhil, Telugu Movie News

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ఇటీవల తాను ప్రేమించిన అమ్మాయిని నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే.డాక్టర్ పల్లవితో గతకొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న నిఖిల్, ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లికి అనుమతి తీసుకోవడంతో వారు ఇటీవల నిశ్చితార్థం చేసుకున్నారు.

 Nikhil Does Not Want To Postpone Wedding

ఇక పెళ్లికి కూడా వారిద్దరు రెడీ అవుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావంతో పెళ్లి క్యాన్సిల్ అవుతుందేమోనని అందరూ భావించారు.

అయితే ఏప్రిల్ 16న తన పెళ్లి ఎట్టిపరిస్థితుల్లో జరుగుతుందని హీరో నిఖిల్ వెల్లడించాడు.

కరోనా రాని గిరోనా రాని.. ఆగేది లేదంటున్న యంగ్ హీరో-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కరోనా వచ్చినా, ఏం వచ్చినా పెళ్లి మాత్రం ఆగేది లేదని కుంబ బద్దలు కొట్టేశాడు.ఇప్పటికే పెళ్లికి ఏర్పాట్లు పూర్తి కావచ్చాయని, షాపింగ్ ఇతరత్రా పనులు కూడా ముగిశాయిన నిఖిల్ తెలిపాడు.

ఏప్రిల్ 16న ఏం జరిగినా తమ పెళ్లి జరగడం మాత్రం ఖాయమని అన్నాడు.ఒకవేళ కరోనా వైరస్ భయంతో ఎవరూ తమ పెళ్లికి రాకపోయినా, పల్లవితో కలిసి గుడిలో పెళ్లి చేసుకునేందుకు నిఖిల్ రెడీ అంటున్నాడు.

కరోనా వైరస్ మాత్రమే కాకుండా ఏం వచ్చినా తమ పెళ్లిని ఆపవని నిఖిల్ అంటున్నారు.ఇంత ధీమాగా తన వివాహాన్ని జరుపుకోవాలని చూస్తు్న్ని నిఖిల్‌ నిర్ణయానికి పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరి కరోనాతో ప్రపంచం మొత్తం వణికిపోతున్న తరుణంలో నిఖిల్ తన పెళ్లి ఎంత ఘనంగా చేసుకుంటాడో చూడాలని పలువురు అంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test