నిఖిల్ కు హైదరాబాద్ పోలీసుల ఝలక్.. ఏం జరిగిందంటే..?

కరోనా సెకండ్ వేవ్ లో భారీగా కేసులు నమోదవుతున్న తరుణంలో కొందరు సెలబ్రిటీలు తమకు తోచిన సహాయం చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.యంగ్ హీరోలలో ఒకరైన నిఖిల్ ఎవరైనా సోషల్ మీడియా వేదికగా సహాయం కోరితే వీలైనంత సహాయం సహాయం చేస్తున్నారు.

 Nikhil Came Out Without Epass Police Responded With A Tweet, Emergencey Medici-TeluguStop.com

సోనూసూద్ తర్వాత కష్టాల్లో ఉన్న వారికి సాయం చేస్తున్న నటుడు నిఖిల్ మాత్రమేనని కామెంట్లు వినిపిస్తున్నాయి.అయితే నిఖిల్ కు పోలీసులు ఝలక్ ఇచ్చారు.

ఈపాస్ లేకుండా నిఖిల్ కరోనా రోగులకు అవసరమైన మందుల పంపిణీకి వెళ్లగా పోలీసులు ఝలక్ ఇచ్చారు.ఉప్పల్ నుంచి కిమ్స్ కు మందుల పంపిణీ కోసం తాను వెళ్లాననిన్ రోగి వివరాలతో పాటు ప్రిస్క్రిప్షన్ ను ఇచ్చినా తనకు అనుమతి లభించలేదని నిఖిల్ పేర్కొన్నారు.

తాను ఈపాస్ కోసం వస్తే సర్వర్ డౌన్ అయిందని వస్తోందని నిఖిల్ వెల్లడించారు.నిఖిల్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.

నెటిజన్లు సైతం నిఖిల్ కు తమ మద్దతును ప్రకటించారు.నిఖిల్ చేసిన ట్వీట్ పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో హైదరాబాద్ సిటీ పోలీసులు స్థానిక పోలీస్ స్టేషన్ ద్వారా మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పామని ఆయన సమస్యను పరిష్కరించారు.చివరకు నిఖిల్ మందులు అవసరమైన వ్యక్తికి మందులను అందించారు.కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న వాళ్లకు అవసరమైన మందులను నిఖిల్ అందజేస్తున్నారు.

పోలీసులు లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేసినప్పటికీ కరోనా రోగులకు మందులు, ఆహారం అందించే వాళ్లకు ఇబ్బందులు కలిగించవద్దని నెటిజన్లు కోరుతున్నారు.మరోవైపు ఆపదలో ఉన్నవాళ్లకు సహాయం చేస్తున్న నిఖిల్ ను నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు.

మరోవైపు నిఖిల్ ప్రస్తుతం 18 పేజెస్, కార్తికేయ2 సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.ఈ రెండు సినిమాల్లో అనుపమ హీరోయిన్ గా నటిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube