ఆ డైరెక్టర్‌తో హ్యాట్రిక్‌కు రెడీ అవుతోన్న నిఖిల్  

Nikhil Another Movie With Sudheer Varma, Nikhil, Sudheer Varma, Karthikeya, Tollywood News - Telugu Karthikeya, Nikhil, Sudheer Varma, Tollywood News

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం వరసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.తాజాగా ఆయన కార్తికేయ-2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

TeluguStop.com - Nikhil Another Movie With Sudheer Varma

గతంలో వచ్చిన కార్తికేయ చిత్రం ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.దీంతో ఈ సినిమా సీక్వెల్‌పై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో కూడా భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇక ఈ సినిమాను దర్శకుడు చందూ ముండేటి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

TeluguStop.com - ఆ డైరెక్టర్‌తో హ్యాట్రిక్‌కు రెడీ అవుతోన్న నిఖిల్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కాగా ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టగానే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.

ఇక ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించేందుకు నిఖిల్ రెడీ అవుతున్నాడు.సుకుమార్ రైటింగ్స్ నుండి రాబోతున్న ‘18 పేజీస్’ అనే సినిమాలో నటించేందుకు నిఖిల్ రెడీ అవుతున్నాడు.

ఇక ఈ సినిమా తరువాత మరోసారి డైరెక్టర్ సుధీర్ వర్మతో ఓ సినిమా చేసేందుకు నిఖిల్ రెడీ అవుతున్నాడు.గతంలో స్వామిరారా, కేశవ లాంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన ఈ కాంబో, ఇప్పుడు ముచ్చటగా హ్యాట్రిక్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు.

ఇక ఈ సినిమాను పూర్తిగా థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు.అతి త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు నిఖిల్, సుధీర్ వర్మలు రెడీ అవుతున్నారు.

కాగా ఈ సినిమాలో మిగతా నటీనటులు, సినిమా టైటిల్ లాంటి విషయాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఇక నిఖిల్ వరుసగా సినిమాలను ఓకే చేస్తుండటంతో, ఆయన సినిమాల మధ్య ఎలాంటి వైవిధ్యాలను చూపిస్తాడో చూడాలని ప్రేక్షకులు అంటున్నారు.

మరి నిఖిల్‌తో ఈ సారి సుధీర్ వర్మ ఎలాంటి సినిమాతో వస్తాడో చూడాలి.

#Karthikeya #Nikhil #Sudheer Varma

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nikhil Another Movie With Sudheer Varma Related Telugu News,Photos/Pics,Images..