ఇప్పుడు నీకు డైరెక్షన్ ఎందుకయ్యా.. ఆ మాటలతో వెనక్కి తగ్గిన హీరో?

సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం నటులుగా కొనసాగుతున్న చాలామంది కెరీర్ మొదట్లో దర్శకత్వం చేయాలని ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వారే.అయితే దర్శకత్వం చేయాలి అని వచ్చి అనుకోకుండా నదులుగా మారిన వారు కూడా చాలామంది ఉన్నారు.

 Nikhil About Missing Direction Chance Details, Nikhil Siddharth, Tollywood, Miss-TeluguStop.com

అలాంటి వారిలో హీరో నిఖిల్ సిద్ధార్థ కూడా ఒకరు.మొదటి డైరెక్షన్ గా చేయాలని ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ సిద్ధార్థ అనుకోకుండా హీరోగా మారాడు.

అయితే మొదట నిఖిల్ కు ఇండస్ట్రీలో నటుడిగా అడుగు పెట్టాలి అన్న ఆలోచన కూడా లేదట.ఏదో మొదట జయం సినిమాలో ఒక బాల నటుడిగా కనిపించి ఆ తర్వాత ఊహించిన విధంగా మరికొన్ని అవకాశాలు అందుకున్నాడట.
అయితే అప్పట్లో లోకల్ హిందీ సినిమాలు హైదరాబాద్ నవాబ్స్ వంటి వాటిలో కూడా నటించి మంచి క్రియేట్ అందుకుని ఆ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేశాడు నిఖిల్ సిద్ధార్థ్.అయితే నిఖిల్ హీరోగా ఒకప్పుడు ఒక సినిమాను డైరెక్ట్ చేయాలి అని అనుకున్నాడట.

అది చిన్న పిల్లల మీద కొనసాగే కథ అని నిఖిల్ సిద్ధార్థ తెలిపాడు.పూర్తిగా స్క్రిప్ట్ రెడీ చేసుకుని కొంతమంది నటీనటులను కూడా ఫైనల్ చేయడం జరిగిందని, ఆ తర్వాత తనకు తెలిసిన దర్శక నిర్మాతలు వద్దు అని చెప్పడమే కాకుండా హీరోగా ప్రయత్నాలు మొదలు పెట్టమని సలహాలు ఇచ్చినట్లు నిఖిల్ సిద్ధార్థ తెలిపాడు.

Telugu Karthikeya, Chance, Producers, Tollywood-Movie

అనవసరంగా ఆ రూట్లోకి వెళ్లి రిస్క్ చేయకూడదు అని అనుకోని తాను కూడా ఆ విధంగా డైరెక్షన్ ను పక్కన పెట్టేసినట్టు నిఖిల్ చెప్పుకొచ్చాడు.అయితే ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా తాను ఒక సినిమాను డైరెక్ట్ చేస్తాను అని చెప్పకనే చెప్పేసాడు నిఖిల్.ఇకపోతే నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటించిన కార్తికేయ 2 సినిమా ఆగస్టు 13 భారీ అంచనాల నడుమ థియేటర్లలో విడుదల కానుంది.కాగా ఇందులో నిఖిల్ సరసన అనుపమ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube