గజినీ కాన్సెప్ట్‌తో రాబోతున్న యంగ్‌ హీరో  

Nikhil 18 Pages Surya Pratap Gajini Surya - Telugu 18 Pages Shooting Start, Corona Virus, Nikhil 18 Pages, Nikhil And Surya Pratap, Surya, Surya In Gajini, Surya Pratap, Tamil Movie Gajini

తమిళంలో వచ్చి తెలుగులో కూడా సూపర్‌ హిట్‌ అయిన చిత్రం ‘గజినీ’.ఆ సినిమాలో హీరో సూర్య తన గతంను మర్చి పోతాడు.

 Nikhil 18 Pages Surya Pratap Gajini Surya

కొద్ది సమయం మాత్రమే గుర్తు వస్తుంది.అతడు ప్రేమించిన అమ్మాయిని చంపిన వారిపై పగ తీర్చుకునేందుకు చేసే సాహసాలే గజినీ చిత్రం.

ఆ సినిమా కాన్సెప్ట్‌ను కాపి కొట్టి, కొందరు ఇన్సిపిరేషన్‌గా తీసుకుని ఎన్నో సినిమాలు చేశారు.ఇప్పుడు మరో సినిమా తెలుగులో రాబోతున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

గజినీ కాన్సెప్ట్‌తో రాబోతున్న యంగ్‌ హీరో-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

నిఖిల్‌ హీరోగా సూర్య ప్రతాప్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘18 పేజెస్‌’.ఈ చిత్రం షూటింగ్‌ ఇటీవలే ప్రారంభం అయ్యింది.ఈ చిత్రం కథ గురించి రకరకాలుగా ప్రచారం జరిగింది.ఈ సినిమాను గీతా ఆర్ట్స్‌ వారు నిర్మిస్తున్న కారణంగా అంచనాలు భారీగా ఉన్నాయి.

అంచనాలకు తగ్గట్లుగా విభిన్నమైన కథాంశంతో దర్శకుడు సూర్య ప్రతాప్‌ తెరకెక్కిస్తున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్‌ మొదలు కాలేదు.ఈ సమయంలోనే స్క్రిప్ట్‌ను మరింత పక్కాగా దర్శకుడు మల్చుతున్నాడట.ఆన్‌ లైన్‌లో అంతా కూడా స్టోరీ చర్చలు జరుపుతున్నారట.

సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో నిఖిల్‌ మెమోరీ లాస్‌ పేషంట్‌గా కనిపించబోతున్నాడట.గతం మర్చి పోయి ఇబ్బందులు పడుతున్న కుర్రాడిగా ఈయన కనిపించబోతున్నట్లుగా చెబుతున్నారు.

ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Related Telugu News,Photos/Pics,Images..