నిఖిల్ 18 పేజెస్ అప్డేట్ వచ్చింది... జూన్ 1న సర్ప్రైజ్

సుకుమార్ రైటింగ్స్, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా 18 పేజెస్ అనే మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.రొమాంటిక్ లవ్ స్టొరీగా దీనిని దర్శకుడు ఆవిష్కరిస్తున్నాడు.

 Nikhil 18 Pages Movie Surprise In June 1, Anupama Parameswaran, Sukumar, Geeta A-TeluguStop.com

సుకుమార్ ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్న సంగతి తెలిసిందే.ఇక ఈ మూవీలో నిఖిల్ కి జోడీగా మల్లు బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది.

బెల్లంకొండ రాక్షసుడు తర్వాత అనుపమ తెలుగులో నటిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం.కుమారి 21 ఎఫ్ లాంటి హిట్ మూవీ దర్శకుడు దీనిని తెరకెక్కిస్తూ ఉండటంతో పాటు విభిన్న కథలతో కెరియర్ బిల్డ్ చేసుకున్న నిఖిల్ హీరోగా నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు భాగానే ఉన్నాయి.

అయితే ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి ఎలాంటి విషయం బయటకి రాలేదు.అయితే షూటింగ్ మాత్రం చాలా వరకు కంప్లీట్ అయినట్లు తెలుస్తుంది.

ఇందులో నిఖిల్ మెమొరీ లాస్ అయిన వ్యక్తిగా కనిపిస్తాడని టాక్ అయితే ఉంది.అతని జీవితంలో జరిగిన సంఘటనల చుట్టూ ఈ కథ ఉంటుందని టాక్.

ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీపై చిత్రయూనిట్ ఒక అప్డేట్ ఇచ్చింది.జూన్ 1న నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా 18పేజెస్ మూవీ నుంచి ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయబోతున్నట్లు స్పష్టం చేశారు.

మరి ఈ ఫస్ట్ లుక్ సినిమా పై ఎంత వరకు ఇంటెన్సన్ క్రియేట్ చేస్తుంది అనేది చూడాలి.ఇదిలా ఉంటే నిఖిల్, చందూ మొండేటి కాంబోలో తెరకెక్కుతున్న కార్తికేయ 2 నుంచి కూడా నిఖిల్ బర్త్ డే సర్ప్రైజ్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube