పవన్ కళ్యాణ్ తో సినిమా కొంప ముంచింది అంటున్న పులి పిల్ల  

Nikesha Patel Open Up Her Failure In Tollywood - Telugu, Pawan Kalyan, Puli Movie, Telugu Cinema

స్టార్ హీరోయిన్ గా ఎదగాలని ఎంతో మంది అందాల భామలు చిత్రపరిశ్రమలోకి అడుగుపెడతారు.అయితే వారు అనుకున్న స్థానం సంపాదించలేక, ఏదో కొన్ని సినిమాలతో ఎడ్జిస్ట్ అయ్యి ఒక మామూలు హీరోయిన్ గా మిగిలిపోతారు.

 Nikesha Patel Open Up Her Failure In Tollywood

తరువాత సంపాదన కోసం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మారిపోయి సినిమాలు చేస్తారు.ఇప్పుడు అలాంటి కోవలోని భామే నికిషా పటేల్.

మొదటి సినిమాలోనే పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోకి జోడీగా నటించిన ఈ భామ తరువాత ఆ స్పీడ్ ని కొనసాగించలేకపోయింది.ఏవో కొన్ని చిన్న సినిమాలు చేసిన ఏవీ కూడా తనకి అనుకున్న స్థాయిలో గుర్తింపు తీసుకురాలేదు.

పవన్ కళ్యాణ్ తో సినిమా కొంప ముంచింది అంటున్న పులి పిల్ల-Movie-Telugu Tollywood Photo Image

ఇప్పుడు ఆమె చేతిలో ఒక్క సినిమా కూడా లేదు.ఈ నేపధ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినిమా కెరియర్ గురించి నికిషా పటేల్ ఆవేదన వ్యక్తం చేసింది.

తన తొలి తెలుగు చిత్రమే పవన్ కల్యాణ్ పక్కన చేయడంతో ఎంతో మంది నా అదృష్టాన్ని చూసి కుళ్లుకున్నారని, అయితే, అదృష్టంతో పాటే దురదృష్టం కూడా వెన్నాడిందని, ఆ సినిమా సరిగ్గా ఆడకపోవడంతో ఆ ప్రభావం తన కెరీర్ పై పడిందని నికిషా పటేల్ వాపోయింది.పెద్ద హీరోలతో సినిమాలు చేయాలని వచ్చిన తాను, ఆ కల ఫలించక పోగా, సర్దుకుపోయి, కొన్ని బడ్జెట్ సినిమాలు చేశానని, అవి కూడా తన కెరీర్ కు మైనస్ గా మారాయని తెలిపింది.

అవకాశాల విషయంలో కాంప్రమైజ్ కాకపోవడంతోనే అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయానని చెప్పింది.కొందరు నూతన హీరోయిన్లకు ఏ మాత్రమూ విలువ ఇవ్వరని, సినీ పరిశ్రమకు ఎందుకు వచ్చామా? అని బాధపడేలా ప్రవర్తిస్తారని వాపోయింది.మొత్తానికి ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ తో చేసిన సినిమా ఫ్లాప్ కారణంగా ఆమె కలలు పూర్తిగా నాశనం అయ్యాయని ఆమె ఇంటర్వ్యూలో తన ఆవేదనని వ్యక్తం చేసింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nikesha Patel Open Up Her Failure In Tollywood Related Telugu News,Photos/Pics,Images..