ఎన్ని వైరస్ లు వచ్చిన వారు భయపడరు అంట!  

viral video, nike, social media, covid-19, corona virus, We are never alone song by players - Telugu Corona Virus, Covid-19, Nike, Social Media, Viral Video, We Are Never Alone Song By Players

కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎలా వణికిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ప్రపంచవ్యాప్తంగా 17,757,513 మంది కరోనా భారిన పడ్డారు.

 Nike Made Add Sports Players Video Goes Viral

కొన్ని లక్షలమంది మరణించారు.అయితే ఈ నెలలో కరోనాకు వ్యాక్సిన్ వస్తుందని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తున్నారు.

దీంతో ఇప్పుడిప్పుడే మెళ్లిగా ఒక్కోటి ప్రారంభమవుతున్నాయి.

ఎన్ని వైరస్ లు వచ్చిన వారు భయపడరు అంట-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇంకా కరోనా కారణంగా ఆగిపోయిన వాటిలో క్రీడలు కూడా ఒకటి.

ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల క్రీడలు ఆగిపోయాయి.ఇప్పుడిప్పుడే మెళ్లిగా అన్ని క్రీడలు ప్రారంభ‌మ‌వుతున్నాయి.

ఆట ఏదైనా సరే జనాలు మైదానంలోకి గుంపులుగా రాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఈ నేపథ్యంలోనే ప్ర‌ఖ్యాత స్పోర్ట్ అడ్వ‌ర్టైజింగ్ కంపెనీ నైక్ క‌రోనా వైర‌స్‌కు బ‌య‌ప‌డేది లేదంటూ త‌న ట్విట‌ర్ ద్వారా అందరికి ఎనర్జీని ఇచ్చే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

దాదాపు 1.39 నిముషాలు ఉన్న వీడియోలో అన్ని రకాల క్రీడలతో పాటు 36 మంది పాత‌త‌రం, కొత్త‌త‌రం స్టార్ ఆట‌గాళ్ల‌ను కలిపి చూపించారు.ర‌ఫెల్ నాద‌ల్‌, జొకొవిచ్‌, టీమిండియా క్రికెట్‌ మ‌హిళ‌ల టీం, క్రిస్టియానో రొనాల్డొ, సెరెనా విలియ‌మ్స్‌, లెబ్ర‌న్ జేమ్స్‌, కొలిన్ కెపెర్‌నిక్ లాంటి దిగ్గ‌జ ఆట‌గాళ్లు అందరూ ఆ వీడియోలో ఉన్నారు.

ఇంకా ఈ వీడియోలో ‘‘వీ ఆర్ నెవ‌ర్ ఎలోన్” అంటూ సాంగ్ నడుస్తుంది.”క‌రోనా లాంటి వైరస్ లు ఎన్ని వైర‌స్‌లు వ‌చ్చినా మేం భయ‌ప‌డం.అథ్లెట్స్‌గా మేం ఎప్పుడు ఒంట‌రివాళ్లం కాదు.

మేమంతా ఐక్యంగా ఉంటూనే ఏ విష‌య‌మైనా కలిసి పోరాడుతాం.మా ఆట‌లే మ‌మ్మ‌ల్ని ఈరోజుకు ఐక్యంగా ఉండేలా చేశాయి.

క‌రోనా వైర‌స్ ఆట‌కు మ‌మ్మ‌ల్ని దూరం చేసినా.తిరిగి మ‌ళ్లీ అదే శక్తితో క‌ల‌సిక‌ట్టుగా వ‌స్తున్నాం” అంటూ మంచి సాంగ్ తో వీడియో ఉంది.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

#Corona Virus #Viral Video #Social Media #Nike #COVID-19

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nike Made Add Sports Players Video Goes Viral Related Telugu News,Photos/Pics,Images..