మెగా ఫ్యామిలీకి సంబందించిన నటులు ఏం చేసిన సోషల్ మీడియాలో వైరల్ గా మారుతాయి.ఆ ఫ్యామిలీ నుంచి సినిమాలు వచ్చిన, ఇక దీనికైనా రియాక్షన్స్ వచ్చిన మెగా ఫాన్స్ వాటిని సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తూ తమ ఆనందాన్ని పంచుకుంటారు.
అయితే ఒక్కో సారి ఇలా వైరల్ అయిన న్యూస్ మెగా కుటుంబ సభ్యులకి ఇబ్బందికి గురి చేస్తాయి.మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా టాలీవుడ్ లో అడుగుపెట్టిన నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
నటిగా ఆమె తనని తాను ప్రూవ్ చేసుకున్న సరైన హిట్ పడకపోవడం వలన హీరోయిన్ గా కొనసాగలేకపోయింది.
అయితే ఈ మధ్య ఆమె ఎక్కువగా ఫోటోషూట్ లతో సందడి చేస్తుంది.
ఆ మధ్య కాస్తా మోడరన్ డ్రెస్ తో ఫోటో షూట్ చేసుకోగా అవి కాస్తా వైరల్ అయ్యాయి.ఆ డ్రెస్ లో ఆమె అందంగా ఉన్నా కూడా కాస్తా ఎక్స్ పోజింగ్ చేసిందని ప్రచారం జరిగింది.
తాజాగా ఆమె ఓ వెడ్డింగ్ ఫోటో షూట్ తో పెళ్లి కూతురు స్టైల్ లో ట్రెడిషనల్ గా కనిపించింది.పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో పట్టు చీర కట్టి సాంప్రదాయ బద్దంగా నిండైన వస్త్రాలు ధరించిన నిహారికా నేను నమ్ముతున్న దానికే అసలు విలువ అంటూ ఫోటో క్యాప్షన్ ఇచ్చింది.
అయితే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెళ్లి ఎప్పుడు, కాబోయే పెళ్లి కొడుకు ఎవరు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.దీంతో ఎలా ఉన్న ఇప్పుడు నిహారికకి సోషల్ మీడియాలో ఇబ్బందికర పరిస్థితి వస్తుందని చెప్పుకుంటున్నారు.