ట్రాక్ మార్చాలని భావిస్తున్న మెగా బ్రదర్ కుమార్తె  

Niharika Turns As Producer-megastar Chiranjeevi,nagababu,niharika,pawan Kalyan,ram Charan,tolliwood Gossips,varun Tej

మెగా ఫ్యామిలీ నుంచి ఒకే ఒక్క హీరోయిన్ నీహారిక మాత్రమే. ఆ ఫ్యామిలీ లో నుంచి మెగా బ్రదర్ కుమార్తె నిహారిక ఒక్కటే టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. అయితే మూడు సినిమా లు చేసినా ఆమె కు ఆ చిత్రాలు ఏమి కూడా హెల్ప్ కాలేకపోయాయి..

ట్రాక్ మార్చాలని భావిస్తున్న మెగా బ్రదర్ కుమార్తె -Niharika Turns As Producer

కానీ ఒక నటిగా మాత్రం నిహారిక అభిమానులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కమర్షియల్ గా ఒక్క చిత్రం కూడా హిట్ కాకపోవడం తో ఇప్పుడు ఈ మెగా హీరోయిన్ ట్రాక్ మార్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తండ్రి రూట్ లోనే కాకపోతే ఒక ఇండిపెండెంట్ బ్యానర్ ను మొదలు పెట్టె ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.

ఈ క్రమంలో అన్న వరుణ్ సూచనలు కూడా తీసుకొని తన ఇండిపెండెంట్ బ్యానర్ ని డెవలప్ చేసుకోవాలని చూస్తుందట.

అందులోనూ తండ్రి కూడా నిర్మాణం లో ఉండడం నిహారికకు మరో ప్లస్ పాయింట్ కానుంది. అయితే చిత్ర నిర్మాణాలతో పాటు ఈ అమ్మడు వెబ్ సిరీస్ ని కూడా కంటిన్యూ చేయాలనీ అనుకుంటుందట. ఎలాగూ కుటుంబంలో పదికి పైగానే హీరోలు ఉన్నారు.

ఏడాదికి ఒకటో రెండో చేయాలనుకున్నా వాళ్లలో ఎవరో ఒకరు ఓకే చెప్తారు. సరైన టీమ్ ని దర్శకుడిని ఎంచుకుంటే చాలు అని భావిస్తుందో ఏమో మరి. మొత్తానికి దీనిలో అయినా నిహారిక ఒక విజయవంతమైన నిర్మాతగా మారి విజయాల్ని అందుకుంటుందేమో చూడాలి..

మరో విషయం ఏమిటంటే ఇంకా దీనిపై నిహారిక ఎలాంటి అధికారిక ప్రకటన అయితే చేయలేదు కానీ టాలీవుడ్ ఇన్ సైడ్ టాక్ గా ఈ టాపిక్ జరుగుతుంది.