బాబాయికి ఓటు వేయండి అంటూ నిహారిక ప్రచారం.. మెగా డాటర్‌కు జనసైనికులు ఫిదా  

Niharika Supports Janasena For Pawan Kalyan-niharika Konidela,niharika Supports Janasena,pawan Kalyan,pawan Kalyan Janasena

జనసేన పార్టీ కోసం మెగా హీరోలు ఎవరు కూడా ప్రచారంకు సిద్దం కావడం లేదు. కుటుంబ మరక వద్దనే ఉద్దేశ్యంతో స్వయంగా పవన్‌ కళ్యాణ్‌ వారిని వద్దని ఉంటాడు అని కొందరు అనుకుని ఉంటారు. ఒకవేళ పవన్‌ ఒక్క పిలుపు పిలిస్తే ఖచ్చితంగా నాగబాబు నుండి మొదలుకుని వరుణ్‌, చరణ్‌, బన్నీ, సాయి ధరమ్‌ తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌ ఇలా అంతా కూడా ప్రచారం చేసేందుకు సిద్దం అవుతారు...

బాబాయికి ఓటు వేయండి అంటూ నిహారిక ప్రచారం.. మెగా డాటర్‌కు జనసైనికులు ఫిదా-Niharika Supports Janasena For Pawan Kalyan

కాని పవన్‌ మాత్రం అందుకు ఆసక్తి చూపడం లేదు. ఎందుకంటే తన కుటుంబంను జనసేనకు సాధ్యం అయినంత దూరం ఉంచాలనేది పవన్‌ అభిప్రాయంగా తెలుస్తోంది. అందుకే పవన్‌ కోసం ఎవరు కూడా ముందుకు రావడం లేదు.

పవన్‌ పిలవకున్నా కూడా మెగా డాటర్‌ నిహారిక తాజాగా తన బాబాయి పవన్‌ కళ్యాణ్‌కు ఓటు వేయాలని కోరింది. తాజాగా నిహారిక ‘సూర్యకాంతం’ అనే చిత్రంలో నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. ఆ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఏపీలో పలు ప్రాంతాల్లో ఈ అమ్మడు తెగ పర్యటించింది. చిత్ర యూనిట్‌ సభ్యులతో పాటు ఈమె పలు కాలేజ్‌ లు, ప్రాంతాల్లో పర్యటించింది.

ఆ సందర్బంగా ఒక కార్యక్రమంలో భారీ ఎత్తున మెగా ఫ్యాన్స్‌ పవన్‌ అంటూ మొత్తుకుంటూ సందడి చేశారు. ఆ సమయంలో నిహారిక చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి..

నాకు ఏపీలో ఓటు లేదు, నా బదులు మీరంతా కూడా బాబాయికి ఓటు వేసి ఆయన్ను గెలిపించండి. ఆయనకు ఓటు వేయాలంటూ నిహారిక పిలుపు ఇవ్వడంతో మెగా ఫ్యాన్స్‌ అంతా హ్యాపీ ఫీల్‌ అయ్యారు.

జనసేన కార్యకర్తలు కూడా కనీసం మెగా డాటర్‌ అయినా జనసేనకు మద్దతుగా వ్యాఖ్యలు చేసింది అని సంతోషంగా ఉన్నారు. త్వరలోనే తాను పార్టీ గుర్తును పట్టుకుని ఫొటో దిగి దాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తానంటూ హామీ ఇచ్చింది.