లిప్ లాక్ ఫోటోను షేర్ చేసి అవాక్కయ్యేలా చేసిన నిహారిక.. వాటికి చెక్ పెడుతూ?

2022 సంవత్సరంలో నిహారిక పాజిటివ్ వార్తల కంటే నెగిటివ్ వార్తల ద్వారానే వార్తల్లో నిలిచారు.నిహారిక చేసిన చిన్నచిన్న పొరపాట్ల వల్ల ఆమె గురించి సోషల్ మీడియాలో నెగిటివ్ గా ట్రోల్స్ వచ్చాయి.

 Niharika Shared Liplock Photo Goes Viral In Social Media , Chaitanya Jonnalagadda , Lip Lock Photo , Netizens Trolls , Niharika , Trip To Jordan-TeluguStop.com

ఇతర హీరోల ఫ్యాన్స్ ఆమెను టార్గెట్ చేసి ట్రోల్ చేశారు.నిహారిక తప్పు చేసిందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేకపోయినా సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో ఆమె గురించి దారుణంగా ప్రచారం జరిగింది.

మరోవైపు ఈ ఏడాది చోటు చేసుకున్న ఘటనల వల్ల నిహారిక చైతన్యల బంధంకు సంబంధించి అనేక గాసిప్స్ ప్రచారంలోకి వచ్చాయి.అయితే గతంలోనే ఈ విషయాలకు సంబంధించి క్లారిటీ ఇచ్చిన నిహారిక తాజాగా మరోసారి ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

 Niharika Shared Liplock Photo Goes Viral In Social Media , Chaitanya Jonnalagadda , Lip Lock Photo , Netizens Trolls , Niharika , Trip To Jordan-లిప్ లాక్ ఫోటోను షేర్ చేసి అవాక్కయ్యేలా చేసిన నిహారిక.. వాటికి చెక్ పెడుతూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఒకే ఒక్క ఫోటోలో నిహారిక పుకార్లకు చెక్ పెట్టారు.ప్రస్తుతం నిహారిక కుటుంబంతో కలిసి జోర్దాన్ ట్రిప్ కు వెళ్లారనే సంగతి తెలిసిందే.అయితే ఈ ట్రిప్ లో నిహారిక భర్తతో కలిసి లిప్ లాక్ ఫోటో దిగగా ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఆ ఫోటోకు ఎప్పటికీ విడిపోని బంధం అంటూ నిహారిక క్యాప్షన్ ఇవ్వగా ఆ క్యాప్షన్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

కొంతమంది ఈ ఫోటో గురించి పాజిటివ్ గా స్పందిస్తుంటే మరి కొందరు నెగిటివ్ గా స్పందిస్తున్నారు.మరి కొందరు మాత్రం గత కొన్నిరోజుల నుంచి ప్రచారంలోకి వస్తున్న పుకార్లకు సంబంధించి నిహారిక ఒక్క ఫోటోతో చెక్ పెట్టిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఫోటోకు భారీగా లైక్స్ వస్తున్నాయి.

చైతన్య సినిమాల్లోకి వస్తారని గతంలో జోరుగా ప్రచారం జరిగినా చైతన్య మాత్రం సినిమాలకు దూరంగా ఉన్నారనే సంగతి తెలిసిందే.నిహారిక పెళ్లి తర్వాత నటనకు దూరంగా ఉన్నా నిర్మాతగా కెరీర్ ను కొనసాగిస్తూ ఉండటం గమనార్హం.నిహారిక కెరీర్ విషయంలో మరింత సక్సెస్ కావాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube