నాన్నకు ఆ ఒక్క విషయం తెలియదు అంటున్న నిహారిక?

టాలీవుడ్ మెగా నటుడు నాగబాబు కూతురు, యంగ్ హీరోయిన్ నిహారిక కొణిదెల.తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న పేరు.

 Niharika Says Dad Doesnt Know That One Thing-TeluguStop.com

మెగా ఫ్యామిలీ నుండి తొలి హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.పలు సినిమాలలో నటించగా అంత సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది.

బుల్లితెర షో లలో కూడా మెప్పించింది.సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

 Niharika Says Dad Doesnt Know That One Thing-నాన్నకు ఆ ఒక్క విషయం తెలియదు అంటున్న నిహారిక-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నిహారిక కు గత ఏడాది జొన్నలగడ్డ చైతన్యతో పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే.ఇక పెళ్లి తర్వాత నిహారిక లో చాలా మార్పులు వచ్చాయి.సోషల్ మీడియాలో మరింత బిజీగా మారింది.తన భర్తతో దిగిన ఫోటోలను, వీడియో లను వ్యక్తిగత విషయాలను బాగా షేర్ చేసుకుంటుంది.

ఇక తన తండ్రి నాగబాబు తో కలిసి చేసే అల్లర్ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ లో నటిస్తుంది.

ఇదిలా ఉంటే తాజాగా తన తండ్రితో కలిసి ఓ ప్రకటనలో నటించింది నిహారిక.ఇక ఆ వీడియోను తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా అభిమానులకు షేర్ చేసుకుంది.

అందులో ఆన్ లైన్ బ్యాంకింగ్ గురించి అవగాహన కల్పించారు.ఈ వీడియోలో నిహారిక తండ్రి తనకు చిన్నప్పటినుండి ప్రతి ఒక్క విషయంలో రక్షణ కవచంలా ఉన్నాడని, ప్రతి విషయాన్ని తనకు తెలుపుతూ ఉన్నాడని తెలిపింది.

కానీ ఒక్క ఆన్ లైన్ ట్రాన్సాక్షన్ తప్ప తెలియదు అంటూ చూపించగా.ఇందులో నాగబాబు ట్రాన్సాక్షన్ గురించి నిహారికని అడుగుతాడు.

దీంతో నిహారిక నవ్వుతో ఇకపై ఈ అకౌంట్ డీటెయిల్స్ అవసరం లేదంటూ, మీ దగ్గర వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఉన్నాయా? అది చాలు.అని ఐసీఐసీఐ మొబైల్ బ్యాంకింగ్ గురించి ప్రకటించారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారగా నెటి జనులు ఈ వీడియోను బాగా లైక్ చేస్తున్నారు.

#Nagababu #Social Media #Viral Video

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు