నిహారిక ఏరికోరి దాన్ని ఎంచుకుంది

మెగా వారసురాలు కొణిదెల నిహారిక సినిమాల్లోకి రాకముందు నుంచే మనందరికి బాగా పరిచయమున్న పేరు.షార్ట్ ఫిలిమ్స్, టీవి షోలతో కొన్నేళ్లుగా మనల్ని అలరిస్తూనే ఉంది ఈ మెగా ప్రిన్సెస్.

 Niharika Rejected 9 Stories Before Oka Manasu-TeluguStop.com

చుట్టూ సినిమా వాతావరణం ఉండటం వలనో, లాఘు చిత్రాలు చేసిన అనుభవం వలనో కాని, సినిమాల మీద, సినిమా కథల మీద నిహారికకు చాలా పట్టు ఉందని చెబుతూ ఉంటారు.

ఇక తను సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాక చాలామంది చాలా కథలు చెప్పారట.

తొమ్మిది కథలు కాదన్న తరువాత ఒక మనసు కథ ఒకే చేసిందట.దర్శకుడు రామరాజు నిహారిక కోసం రాసుకున్న పాత్ర, ఇద్దరు ప్రేమికుల మధ్య ఉన్న నిర్మలత్వం నిహారికని ఎంతగానో ఆకట్టుకోవడంతో, మరోమాట చెప్పకుండా సినిమా ఒప్పేసుకుంది.

మరి నిజంగానే నిహారికకి కథల మీద బాగా పట్టు ఉందా లేదా అనేది ఈ చిత్రం విడుదల అవగానే తెలిసిపోతుంది.

నాగ శౌర్య హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి మధుర శ్రీధర్ రెడ్డి నిర్మాత .సునీల్ కశ్యప్ బాణీలు సమకూర్చాడు.ఇటివలే విడుదలైన పాటలకు మంచి స్పందన లభించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube