హద్దులు దాటుతున్న మెగా హీరోయిన్ అందాల ఆరబోత...  

Niharika Photos Goes Viral In Tollywood - Telugu Niharika Latest News, Niharika Latest Photo Shoot, Niharika News, Niharika Photos, Niharika Photos News, Tollywood Actress Niharika

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ కి ఉన్న క్రేజ్ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు.అయితే ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలు వచ్చినప్పటికీ కేవలం ఒకే ఒక్క హీరోయిన్ మాత్రమే సినీ పరిశ్రమకి వచ్చింది.

Niharika Photos Goes Viral In Tollywood - Telugu Niharika Latest News, Niharika Latest Photo Shoot, Niharika News, Niharika Photos, Niharika Photos News, Tollywood Actress Niharika-Latest News-Telugu Tollywood Photo Image

అయితే ఆమె ఎవరో కాదు మెగా బ్రదర్ టవర్ స్టార్ నాగబాబు కూతురు నిహారిక.అయితే వచ్చి రావడంతోనే ఒక మనసు చిత్రంతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నప్పటికీ ఆ తర్వాత వచ్చినటువంటి హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం పెద్దగా ఈ అమ్మడికి కలిసి రాలేదు.

అయితే మెగాస్టార్ చిరంజీవి నటించినటువంటి సైరా చిత్రంలో నటించినప్పటికీ ఆ పాత్ర కి పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో ఈ అమ్మడిని ఎవరూ గుర్తించలేదు.దీంతో సైరా పై చాలా ఆశలు పెట్టుకున్న ఈ అమ్మడి ఆశలు అడియాశలయ్యాయి.

అయితే ఈ మధ్యకాలంలో ఈ అమ్మడి చేతిలో అవకాశాలు లేకపోవడంతో వరుస ఫోటో షూట్ లతో బిజీబిజీగా గడుపుతోంది.

తాజాగా ఓ ప్రముఖ ఫోటోషూట్ సంస్థ నిర్వహించినటువంటి ఫోటో షూట్లో లో ఫోజులు ఇచ్చింది.

అంతే కాక ఈ ఫోటోని తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో తన అభిమానులతో పంచుకుంది.అయితే ఎప్పుడు ట్రెడిషనల్ గా మరియు గ్లామర్ కి కొంత తక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి ఈ అమ్మడు కొంతమేర గ్లామర్ డోస్ పెంచిన ట్లు తెలుస్తోంది.

 ఈ ఫోటో ఫై పలువురు నెటిజన్ల ఫైర్ అవుతున్నారు.అంతేకాక అవకాశాల కోసం ఎందుకు ఇలాంటి ఫోటో షూట్ లో ఫోజులు ఇస్తున్నావ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరికొందరు మాత్రం సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే గ్లామర్ షో చేయక తప్పదని అంతేగాక గ్లామర్ షో అనేది కూడా చిత్రం కెరీర్లో ఓ ప్రాధాన్యత ఉన్నటువంటి అంశమని కాబట్టి అందులో తప్పేమీ లేదని అంటున్నారు.ఏదేమైనప్పటికీ గతకొద్దికాలంగా నిహారిక ఇలాంటి ఫోటోలకి ఫోజులు ఇస్తూ ఉండటంతో కొంత మేర మెగా అభిమానుల ఆగ్రహానికి గురవుతోంది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో సినిమాలేవీ లేవు.దీంతో నిహారిక వెబ్ సిరీస్ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.అంతేకాక ఇప్పటికే ఓ వెబ్ సిరీస్ కథ నచ్చడంతో అందులో నటించేందుకు ఓకే చెప్పినట్లు కూడా తెలుస్తోంది.అయితే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి హీరోలు బాగానే రానిస్తున్నప్పటికీ నిహారిక మాత్రం కొంతమేర సినీరంగం పరంగా కష్టాలను ఎదుర్కొంటూ ఉందని చెప్పవచ్చు.

తాజా వార్తలు