నిహారిక వివాహ నిశ్చితార్థం హడావుడి లేదేం?

మెగా డాటర్‌ నిహారిక చైతన్యల వివాహ నిశ్చితార్థంను ఆగస్టులో నిర్వహించబోతున్నట్లుగా ఆ మద్య వార్తలు వచ్చిన విషయం తెల్సిందే.ఆగస్టు ఇప్పటికే సగం వరకు పూర్తి అయ్యింది.

 Niharika Konidela Marriage News, Niharika, Mega Family, Ips Officer Son, Chaitan-TeluguStop.com

అయినా మెగా వారి ఇంట పెళ్లి సందడి కనిపించడం లేదు ఏంటో అంటూ మెగా ఫ్యాన్స్‌ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.నాగబాబు ప్రస్తుతం తన యూట్యూబ్‌ ఛానెల్‌లో వరుసగా వీడియోలు అయితే పెడుతున్నారు.

కాని ఆయన తన కూతురు పెళ్లికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం చేయడం లేదు అంటూ ఒక వర్గం మెగా ఫ్యాన్స్‌ పెదవి విరుస్తున్నారు.

ఏపీకి చెందిన ప్రముఖ ఐపీఎస్‌ ఆఫీసర్‌ తనయుడు అయిన చైతన్యతో నిహారిక వివాహం కన్ఫర్మ్‌ అయ్యింది.

ఆగస్టులో నిశ్చితార్థం ఫిబ్రవరిలో పెళ్లి అంటూ వార్తలు వచ్చాయి.చెల్లి నిశ్చితార్థం కోసం వరుణ్‌ తన బాక్సింగ్‌ సినిమా షూటింగ్‌ను వాయిదా వేశాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

కాని నిహారిక నిశ్చితార్థ వేడుక గురించి మాత్రం ఎలాంటి లీక్‌ రావడం లేదు.ప్రస్తుతం కరోనా సమయం అవ్వడం వల్ల హడావుడి లేకుండా సింపుల్‌గా నిశ్చితార్థం చేస్తారేమో అంటున్నారు.

పవన్‌ చతుర్మాస దీక్ష పూర్తి చేసిన తర్వాత నిహారిక నిశ్చితార్థం ఉండే అవకాశం ఉందని కొందరు అంటున్నారు.త్వరలో ఆ విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఇక పెళ్లి తర్వాత నిహారిక సినిమాల్లో నటించేది అనుమానమే అంటున్నారు.అయితే ఆమెకు నటనపై ఉన్న ఆసక్తితో వెబ్‌ సిరీస్‌ల్లో నటించే అవకాశం ఉందని మెగా వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.

నిహారికను పెళ్లి చేసుకోబోతున్న చైతన్య హీరోగా పరిచయం అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా వార్తలు వస్తున్నాయి.ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube