నిహారిక లిప్‌ లాక్‌ ఎవరితోనో తెలిసి పోయింది

మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కారణంగా నిహారికతో తెలుగు హీరోలు ఎవరు కూడా రొమాన్స్‌ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు.ఈమె ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో పద్దతిగా చూపించేందుకు ప్రయత్నించారు.

 Niharika Lip Lock With Ashok Selvan Niharika, Mega Family, Ashok Selvan, Swathi-TeluguStop.com

హీరోలు కూడా ఆమె పట్ల చాలా గౌరవంగా ప్రవర్తించారు.కాని ఒక్కటి అంటే ఒక్కటి కూడా రొమాంటిక్‌ సీన్‌ లేదు.

ఈతరం ప్రేక్షకులు రొమాంటిక్‌ సీన్స్‌ లేకుంటే అసలు సినిమా చూసే పరిస్థితి లేదు.ఎంతటి స్టార్‌ అయినా రొమాంటిక్‌గా నటించాల్సిందే.

తాజాగా నిహారిక రొమాంటిక్‌ సీన్స్‌కు ముద్దు సీన్స్‌కు రెడీ అయ్యింది.ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో తన రాబోయే సినిమాలో ముద్దు సీన్స్‌తో పాటు గోవాలో రొమాంటిక్‌ సీన్స్‌ కూడా ఉంటాయని పేర్కొంది.

తమిళంలో తెరకెక్కబోతున్న ఆ సినిమా లాక్‌ డౌన్‌ పూర్తి అయిన వెంటనే షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది.కెరీర్‌లో మొదటి సారి కొత్తగా కనిపించబోతున్నట్లుగా ఆమె పేర్కొంది.

అయితే నిహారిక ఎవరితో నటించబోతుంది అనేది గత కొన్ని రోజులుగా అందరిని ఊరిస్తున్న ప్రశ్న.

Telugu Ashok Selvan, Niharika, Niharika Latest, Swathi, Tollywood-Movie

ఎట్టకేలకు ఆ ప్రశ్నకు సమాధానం లభించింది.తమిళంలో యంగ్‌ క్రేజీ హీరోగా గుర్తింపు దక్కించుకున్న అశోక్‌ సెల్వన్‌కు జోడీగా ఈ అమ్మడు నటించబోతుంది.ఈ సినిమాను స్వయంగా అశోక్‌ సెల్వన్‌ నిర్మించబోతున్నాడు.

ఈ చిత్రానికి దర్శకురాలిగా స్వాతిని వ్యవహరించబోతుంది.వీరు ముగ్గురు క్లోజ్‌ ఫ్రెండ్స్‌.

వీరు కలిసి పలు పార్టీల్లో ఎంజాయ్‌ చేశారు.వీరి ముగ్గురి ఫొటోలు సోషల్‌ మీడియాలో చాలానే ఉంటాయి.

ఈ స్నేహితులు ఇప్పుడు సినిమా కోసం పని చేయబోతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube