ఫ్రీగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నా.. నిహారిక కామెంట్స్ వైరల్!

మెగా ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి నటిగా గుర్తింపును సొంతం చేసుకున్న నిహారిక తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.తాను ఇప్పుడు మా నాన్న ఇంట్లో ఉండటం లేదని నిహారిక అన్నారు.

 Niharika Lives Separately With Her Husband Details, Niharika, Niharika Lives Sep-TeluguStop.com

అదే సమయంలో మామగారి ఇంట్లో కూడా ఉండటం లేదని నిహారిక చెప్పుకొచ్చారు.తాను, తన భర్త అత్తారింటికి, పుట్టింటికి దూరంగా ఉంటున్నామని నిహారిక తెలిపారు.

కొన్నిరోజుల పాటు మేమిద్దరమే ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నామని దగ్గరి వాళ్లు ఎవ్వరూ లేరని నిహారిక అన్నారు.బాల్యం నుంచి తాను సింగిల్ గా ఎప్పుడూ ఉండలేదని నిహారిక చెప్పుకొచ్చారు.

హాస్టల్ లో కూడా తాను లేనని ఏదైనా ట్రిప్ కు వెళ్లినా మూడు రోజుల కంటే ఎక్కువ రోజులు వెళ్లేదాన్ని కాదని నిహారిక అన్నారు.పెళ్లైంది కాబట్టి ఇప్పుడైనా కొన్ని రోజులు ఫ్రీగా ఉంటామని నిహారిక కామెంట్లు చేశారు.

సినిమాలతో పోలిస్తే ఓటీటీపైనే ఎక్కువగా దృష్టి పెట్టామని నిహారిక వెల్లడించారు.

Telugu Chaitanya, Separately, Niharika, Naga Babu, Tollywood-Movie

నటిగా, నిర్మాతగా ఇండస్ట్రీలో కెరీర్ ను కొనసాగిస్తానని నిహారిక చెప్పుకొచ్చారు.ఓ చిన్న ఫ్యామిలీ స్టోరీ పేరుతో ఒక వెబ్ సిరీస్ ను తాను ప్రొడ్యూస్ చేశానని అది జీ5లో స్ట్రీమింగ్ కు వచ్చిందని నిహారిక పేర్కొన్నారు.నటిగా ఒక వెబ్ సిరీస్ తెరకెక్కుతోందని నిహారిక వెల్లడించారు.

త్వరలో ఆ వెబ్ సిరీస్ వివరాలను ప్రకటిస్తానని నిహారిక అన్నారు.

Telugu Chaitanya, Separately, Niharika, Naga Babu, Tollywood-Movie

భర్త ఇష్టంతోనే పెళ్లి తర్వాత నటిగా కెరీర్ ను కొనసాగిస్తున్నానని నిహారిక కామెంట్లు చేశారు.తన బ్రదర్ వరుణ్ తేజ్, తన భర్త చైతన్య క్లాస్ మేట్స్ అంటూ అభిమానులకు తెలియని షాకింగ్ విషయాన్ని నిహారిక చెప్పుకొచ్చారు.నిహారిక ఇప్పటికే నటించిన వెబ్ సిరీస్ లు సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube